ETV Bharat / bharat

'ఆడియో టేపు'లపై భాజపా ఫైర్​- కాంగ్రెస్​ నేతలపై ఫిర్యాదు!

author img

By

Published : Jul 18, 2020, 6:00 AM IST

రాజస్థాన్​ రాజకీయాల్లో ఆడియో టేపుల దుమారం చెలరేగుతోంది. కావాలనే టేపులను సృష్టించి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ పలువురు కాంగ్రెస్ నేతల​పై పోలీసులకు ఫిర్యాదు చేసింది భాజపా. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర అని ఆరోపించింది.

BJP's Laxmikant Bhardwaj has filed a complaint against Congress leaders
ఆడియో టేపుల దుమారం

రాజస్థాన్​ రాజకీయాల్లో ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భాజపా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే నకిలీ ఆడియో టేపులను సృష్టించి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ.. కాంగ్రెస్​ నేతలు మహేశ్​ జోషి, రణ్​దీప్​ సుర్జేవాలా, ఇతర నేతలపై ఫిర్యాదు చేశారు భాజపా అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్​ భరద్వాజ్​.

" భాజపా నేతల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రాజస్థాన్​లో కాంగ్రెస్​ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. లోకేశ్​ శర్మ నకిలీ ఆడియో టేపులను సృష్టించారు. అది మా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఆడియో టేపుల సృష్టి, తప్పుడు ఆరోపణలపై అశోక్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో కాంగ్రెస్​ నేతలు మహేశ్​ జోషి, రణ్​దీప్​ సుర్జేవాలా సహా పలువురిపై ఫిర్యాదు చేశాను."

- లక్ష్మీకాంత్​ భరద్వాజ్​, భాజపా అధికార ప్రతినిధి

సంజయ్​ జైన్​ అరెస్ట్​..

ఆడియో టేపులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్​ జైన్​ను స్పెషల్​ ఆపరేషన్​ గ్రూప్​(ఎస్​ఓజీ) పోలీసులు అరెస్ట్​ చేశారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్​ 124ఏ, 120బీ కింద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: రాహుల్​ విమర్శలకు జైశంకర్ ఘాటు జవాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.