ETV Bharat / bharat

బీబీసీకి ఈడీ మరో షాక్​.. ఫెమా కేసు నమోదు

author img

By

Published : Apr 13, 2023, 12:24 PM IST

Updated : Apr 13, 2023, 1:25 PM IST

బీబీసీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఫెమా కేసు నమోదు చేసింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను.. స్టేట్‌మెంట్‌లు రికార్డ్​ చేయడం కోసం పిలిచింది. ఈడీ అధికారులు గురువారం ఆ విషయాలు వెల్లడించారు.

bbc ed raid india
బీబీసీ ఇండియా పై ఈడీ కేసు

విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫెమా(ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనల ప్రకారం కొంతమంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను.. స్టేట్‌మెంట్‌లు రికార్డ్​ చేయడం కోసం పిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలను.. గురువారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. కంపెనీ చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఉల్లంఘనలపై.. ప్రధానంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనున్నట్లు వారు వెల్లడించారు.

ఫిబ్రవరిలో దిల్లీ, ముంబయి బీబీసీ కార్యాలయాల్లో ఈడీ సర్వే ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సర్వే అనంతరం బీబీసీ వార్తా సంస్థ చూపుతున్న ఆదాయం, లాభాల్లో తేడాలున్నాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ(సీబీడీటీ) తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ, ఐటీ అధికారులు.. బీబీసీ ఉద్యోగులు ఇచ్చిన వివరాలు, డిజిటల్ అధారాలు, పత్రాల ద్వారా కీలకమైన ఆధారాలను వెలికితీసింది. డాక్యుమెంటేషన్‌ బదిలీ ధరలకు సంబంధించి అనేక వ్యత్యాసాలు, అసమానతలు ఉన్నాయని వెల్లడించింది.

బీబీసీపై ఐటీ సర్వేకు కొన్ని వారాల ముందు "ఇండియా.. ద మోదీ క్వశ్చన్" పేరిట బీబీసీ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీన్ని రెండు భాగాలుగా దీన్ని రూపొందించింది. 2002లో మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్​ జరిగిన అల్లర్ల గురించి చెప్పడమే ఈ డాక్యుమెంటరీని ముఖ్య ఉద్దేశం. దీంతో బీబీసీ భారత ప్రభత్వం, వివిధ వర్గాల ప్రజల నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. భారత్​లో బీబీసీ ఫేక్ న్యూస్​ ప్రచారం చేస్తుందనే ఆరోపణలను సైతం మూటగట్టుకుంది. దేశాన్ని అస్థిరపరిచేందుకే బీబీసీ ఈ పనులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం అరోపించింది. ఈ నేపథ్యంలోనే బీబీసీపై.. ఆదాయ పన్ను శాఖ అధికారులు సర్వే జరిపారు.

అనంతరం బీబీసీ ఇండియా నిర్వహకులకు ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. సమన్లు జారీ చేసి విచారణకు పిలిచారు. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని విడుదల అనంతరం 2023 జవవరిలో.. సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. వివాదాలు సృష్టించే యూట్యూబ్​, ట్విట్టర్​ వీడియోలను బ్లాక్​ చేయాలని సూచించింది.

లాలూ కుమార్తెలు, కొడుకును విచారించిన ఈడీ..
ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసులో ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు.. చందా యాదవ్​ స్టేట్​మెంట్​ను ఈడీ అధికారులు గురువారం రికార్డ్​ చేశారు. లాల్​ప్రసాద్​ యాదవ్​ మరో కూతురు.. రాగిని యాదవ్​ను​ కూడా బుధవారం ఈడీ విచారించింది. మరో కూతురు, రాజ్యసభ ఎంపీ మీసా భారతిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. లాలూ కుమారుడు, బిహార్​ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​ను.. దిల్లీలోని కార్యాలయంలో సోమవారం ఈడీ విచారించింది.

Last Updated :Apr 13, 2023, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.