ETV Bharat / bharat

కాంగ్రెస్​కు ఆనంద్​ శర్మ షాక్, కీలక పదవికి రాజీనామా, ఆజాద్​ బాటలోనే

author img

By

Published : Aug 21, 2022, 3:06 PM IST

anand sharma resigns
anand sharma resigns

హిమాచల్​ప్రదేశ్​ కాంగ్రెస్​ పార్టీ స్టీరింగ్​ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సీనియర్​ నేత ఆనంద్​ శర్మ. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.

Anand sharma resigns : హిమాచల్​ప్రదేశ్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్​ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర స్టీరింగ్​ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సీనియర్​ నేత ఆనంద్​ శర్మ. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ సమావేశాలకు తనను ఆహ్వనించడం లేదని.. అందుకే తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్​ ప్రచార కమిటీ ఛైర్మన్​ పదవికి కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన జీ23 నేత గులాం నబీ ఆజాద్​ బాటలోనే శర్మ పయనించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం మాత్రం తైను పని చేస్తానని కాంగ్రెస్​ అధినేత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఆనంద్ శర్మ.

ఆనంద్​ శర్మ అంతకుముందు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ డిప్యూటి లీడర్​గా సేవలు అందించారు. ఆయన్ను ఏప్రిల్​ 26న హిమాచల్​ప్రదేశ్​ స్టీరింగ్​ కమిటీ ఛైర్మన్​గా నియమించారు. ఈ కమిటీలో దిగ్గజ నేతలు భూపిందర్​ సింగ్​ హుడా, మనీశ్​ తివారీ ఉన్నారు. హిమాచల్​ ప్రదేశ్​లో బలమైన నేతగా ఉన్నారు ఆనంద్​ శర్మ. 1984లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఈ ఏడాది చివర్లో హిమాచల్​ప్రదేశ్​ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

ఇవీ చదవండి: నిమిషంలో బొలెరో మాయం చేసిన లుంగీ దొంగలు

ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, కారుతో ఢీకొట్టి చంపిన ఉన్మాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.