ETV Bharat / bharat

ఆర్​టీసీ బస్సుపై కొండ విరిగిపడి 23 మంది మృతి

author img

By

Published : Aug 14, 2021, 4:01 PM IST

హిమాచల్​ ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. శనివారం మరో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. గల్లంతైన మరో 9 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

himachal pradesh landslide
కొండచరియలు విరిగిపడిన ఘటన

హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. శనివారం మరో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఐదో నంబర్ జాతీయ రహదారిపై నిచార్ తాలుకా చౌరా గ్రామంలోని శిథిలాల వద్ద ఆరుగురి మృతదేహాలు కనిపించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి సుదేశ్​ కుమార్​ మోఖ్తా తెలిపారు. గల్లంతైన మరో 9 మంది కోసం తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్​డీఆర్ఎఫ్​ సిబ్బంది, ఐటీబీపీ సిబ్బంది, స్థానిక పోలీసులు, హోంగార్డులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

himachal pradesh landslide
కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతం
rescue operations
కొనసాగుతున్న సహాయక చర్యలు

కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లపై బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన జరిగిన రోజున శిథిలాల కింద నుంచి 10 మృతదేహాలను వెలికితీయగా మరో 13 మందిని రక్షించారు. గురువారం మరో నాలుగు మృతదేహాలను లభ్యమయ్యాయి. శనివారం మరో ఆరు మృతదేహాలు లభ్యం కాగా.. మరో 9 మంది గల్లంతయ్యారని అధికారులు భావిస్తున్నారు.

rescue operations
కిన్నౌర్ జిల్లాలో సహాయక చర్యలు
rescue operations
సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది

మరోవైపు.. కొండచరియలు విరిగిపడటం కొనసాగుతున్నందున.. ఈ ప్రాంతంలో రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల మధ్య వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు నిచార్​ సబ్ డివిజినల్​ మేజిస్ట్రేట్​ మన్మోహన్ సింగ్​ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి: పంద్రాగస్టున పేలుళ్లకు ఉగ్రకుట్ర- భగ్నం చేసిన పోలీసులు

ఇదీ చూడండి: బెదిరింపు సందేశాలు.. పోలీసుల హై అలర్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.