ETV Bharat / bharat

అడవిలో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి.. ఐదు రోజుల తర్వాత ఆచూకీ..

author img

By

Published : May 2, 2022, 8:00 PM IST

Updated : May 2, 2022, 10:03 PM IST

3 Years Old Girl Lost In Forest: కర్ణాటక బెళగావి జిల్లాలో మూడేళ్ల చిన్నారి అడవి సమీపంలో ఆడుకుంటూ అదృశ్యమైంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఐదు రోజుల అనంతరం చిన్నారి గాయాలతో దొరికింది.

KARNATAKA news
KARNATAKA news

3 Years Old Girl missing In Forest: అడవి సమీపంలో ఆడుకుంటూ మూడేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన కర్ణాటకలో జరిగింది. బెళగావి జిల్లా తవరగట్టికి చెందిన శివాజీ ఇతగేకర్​కు భార్య, మూడేళ్ల కూతురు ఉన్నారు. ఏప్రిల్​ 26న తన అమ్మమ్మ గ్రామమైన ఖానాపుర్​ చిరేఖాని గ్రామానికి వెళ్లింది చిన్నారి. ఈ క్రమంలోనే అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంది. ఆడుకుంటూనే సమీపంలోని అడవిలోకి వెళ్లింది. దీంతో చిరేఖని గ్రామస్థులు, శివాజీ కుటుంబ సభ్యులు మంగళవారం నుంచి వెతకడం ప్రారంభించారు. మూడు రోజులుగా ఎలాంటి ఆచూకీ లేకపోవడం వల్ల బాలిక కుటుంబ సభ్యులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

belagavi news
చిన్నారి ఆడుకున్న అమ్మమ్మ ఇల్లు
belagavi news
చిన్నారి తప్పిపోయిన అడవి

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక జాడ కోసం అటవీ శాఖ సహాయాన్ని కోరారు. శుక్ర, శనివారాల్లో సమీప గ్రామాలకు చెందిన యువకులతో కలిసి అటవీ శాఖ సబ్బంది అడవిని జల్లెడ పట్టారు. అదృష్టవశాత్తు శనివారం సాయంత్రం ఓ చెట్టు కింద నిద్రపోతూ కనిపించింది చిన్నారి. అయితే చీమలు, పురుగులు చిన్నారి కాళ్లు, చేతుల్ని కొరకడం వల్ల ఆమె నడవలేని స్థితిలో ఉందని అధికారులు తెలిపారు. వెంటనే చిన్నారిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు బెళగావి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉందని ఆమె తాత తెలిపారు.

ఇదీ చదవండి: సఫారీ బస్​పైకి దూసుకొచ్చిన గజరాజు.. పర్యటకులు హడల్​

Last Updated :May 2, 2022, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.