ETV Bharat / bharat

విమానం గాల్లో ఉండగా కుదుపులు- 13 మందికి గాయాలు

author img

By

Published : May 2, 2022, 11:13 AM IST

ముంబయి నుంచి బంగాల్​లోని దుర్గాపుర్​ వెళ్తున్న స్పైస్​జెట్ విమాన ప్రయాణికులు.. ఆదివారం కాసేపు ప్రత్యక్ష నరకం చూశారు. విమానం గాల్లో ఉండగా తీవ్ర కుదుపులకు లోనవగా.. అందరూ భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు.

SpiceJet turbulence
విమానం గాల్లో ఉండగా కుదుపులు- 13 మందికి గాయాలు

స్పైస్‌జెట్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ బి737 విమానమొకటి వాతావరణ మార్పుల కారణంగా ఆదివారం గాల్లో భారీగా కుదుపులకు (టర్బలెన్స్‌) లోనైంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ముంబయి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపుర్‌ నగరానికి చేరుకున్న విమానం ల్యాండ్‌ అవడానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై స్పైస్‌జెట్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీజీసీఏ.. దర్యాప్తు ప్రారంభించింది.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.