Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇలానే

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 11:43 AM IST

thumbnail

Heavy Rains in Hyderabad : ఆదివారం తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి హైదరాబాద్​ మహా నగరం తడిసిముద్దయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. రోడ్లపై నుంచి వర్షపు నీరు డ్రైనేజీతో పాటు ప్రవహించింది. నగరంలోని జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలోని యూసుఫ్​గూడ, కృష్ణానగర్​లలో వర్షం కారణంగా రోడ్లు జలమయమై.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.

అలాగే పంజాగుట్ట, జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు బోరబండ, అల్లాపూర్​, మోతీనగర్​, రహమత్​నగర్​, సనత్​ నగర్​, అమీర్​పేట్​, మైత్రివనం ప్రాంతాల్లో వాన పడింది. ఉక్కపోతతో సతమతమవుతున్న భాగ్యనగర వాసులకు.. ఇలా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం పొందారు. 

కానీ భారీ వర్షం కురిస్తే మాత్రం మళ్లీ ఇళ్లలోకి నీరు చేరుతుందేమో అన్న భయంలో లోతట్టు ప్రాంతాల వాసులు ఉన్నారు. మరోవైపు సికింద్రాబాద్​, కోఠి, బేగంబజార్​, ఖైరతాబాద్​, అబిడ్స్​, నాంపల్లి, బషీర్​బాగ్​, నారాయణగూడ, హిమాయత్​ నగర్, లక్డీకాపూల్​, ట్యాంక్​ బండ్​, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్​, కేపీహెచ్​బీ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రెండు రోజుల పాటు ఇలానే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.