మోతాదుకు మించి పేలుళ్లపై జనాగ్రహం - సిమెంట్ కర్మాగారం ముట్టడి, అద్దాలు ధ్వంసం
Agitation of Villagers in Cement Factory : వైయస్ఆర్ జిల్లా మైలవరం మండలంలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులు నాపరాయి కోసం మోతాదుకు మించి బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇళ్లకు నెర్రలు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెస్తున్నారు. దీంతో మంగళవారం నవాబుపేట గ్రామస్థులు పెద్ద ఎత్తున కర్మాగారం వద్దకు చేరుకుని పరిశ్రమ లోపల యాజమాన్యాన్ని నిలదీశారు.
Factory Rooms were Destroyed by Villagers in YSR District : నాపరాయి కోసం మోతాదుకు మించి బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇళ్లు నెర్రలు చీలుతున్నాయని, పంట పొలాలు పాడవుతున్నాయని నవాబుపేట ప్రజలు వాపోతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బ్లాస్టింగ్పై స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. సిమెంట్ ప్లాంట్ గేటు మూసివేసి ఫ్యాక్టరీ విధులను అడ్డుకున్నారు. అక్కడ జరిగిన తోపులాటలో ఫ్యాక్టరీ గదుల అద్దాలు ధ్వంసమయ్యాయి. అధికారులు సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది.