ETV Bharat / state

వివేకా హత్య కేసు: ఆ ఇంట్లో దుండగులు మకాం వేశారా?

author img

By

Published : Sep 19, 2020, 7:10 PM IST

వివేకా హత్య కేసు : ఆ ఇంట్లోనే దుండగులు మకాం వేశారా?
వివేకా హత్య కేసు : ఆ ఇంట్లోనే దుండగులు మకాం వేశారా?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటి వరకూ నలుగురు సీబీఐ అధికారులు పులివెందులలో విచారణ చేస్తుండగా.. తాజాగా పది మంది అధికారులు చేరుకున్నారు. వివేకా ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని అధికారులు పరిశీలించారు. హత్య జరగడానికి ముందు పక్క ఇంట్లో దుండగులు మకాం వేశారా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 8వ రోజు కొనసాగుతోంది. వారం రోజుల నుంచి నలుగురు సీబీఐ అధికారులు మాత్రమే పులివెందులలో మకాం వేసి కేసు వివరాలను ఆరా తీస్తుండగా... శనివారం 10 మందికి పైగానే సీబీఐ అధికారులు పులివెందులు చేరుకున్నారు. వీరందరూ పులివెందులలోని వివేకా ఇంటిని పరిశీలించారు. వివేకా హత్య జరిగిన బెడ్ రూం, బాత్ రూం ప్రదేశాలను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని కూడా పరిశీలించారు. ఈ రెండు ఇళ్లలో పని చేసేవారు, వాచ్​మెన్​ గురించి ఆరా తీశారు.

సీబీఐ అధికారుల పరిశీలన సమయంలో ఇంట్లో ఉన్న వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివేకా ఇంటి పక్కన ఉన్న ఇంటిని అధికారులు ఎక్కువగా పరిశీలన చేస్తున్నారు. హత్య జరగడానికి ముందు ఈ ఇంట్లో దుండగులు మకాం వేశారా అనే కోణంలో కూడా సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి : ఎన్డీబీ రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.