Janasena Murthy Yadav on Visakha TDR Scam:'విశాఖలో భారీ కుంభకోణానికి తెరలేపిన ఎంపీ సాయిరెడ్డి.. భూదోపిడీపై న్యాయపోరాటం చేస్తా'
Published: Sep 8, 2023, 3:37 PM


Janasena Murthy Yadav on Visakha TDR Scam:'విశాఖలో భారీ కుంభకోణానికి తెరలేపిన ఎంపీ సాయిరెడ్డి.. భూదోపిడీపై న్యాయపోరాటం చేస్తా'
Published: Sep 8, 2023, 3:37 PM

Janasena Murthy Yadav on Visakha TDR Scam: విశాఖలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తప్పుడు పత్రాలతో 2,800 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఆయన.. భూదోపిడీపై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు.
Janasena Murthy Yadav on Visakha TDR Scam: వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తప్పుడు పత్రాలతో 2,800 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రూ.2,800 కోట్ల టీడీఆర్ ప్రాతిపదనలకు ఫైలు కదుపుతున్న అధికారులు.. ఇది 100 ఏళ్ల క్రితం రాణి సాహిబా వాద్వాన్ భూమి అంటూ విశాఖ పెద్దజాలరిపేట మత్స్యకార గ్రామంపై ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారని తెలిపారు. క్లైమ్ను పరిశీలించకుండా, న్యాయస్థానాల్లో సవాలు చేయకుండా వేల కోట్ల రూపాయలను అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
Visakha TDR Scam: ఇందులో 10 శాతం రాణి వారసులు, 90 శాతం విజయ సాయి బృందం పంచుకుంటున్నట్లుగా ఆయన ఆరోపించారు. ఇలాగే టీడీఆర్లు ఇస్తే సింహాచలం దేవస్థానానికి లక్షల కోట్ల రూపాయలను ఇవ్వాలని అన్నారు. ముస్లిం వక్ఫ్ బోర్డుకు వేల కోట్ల రూపాయలను చెల్లించాలని పేర్కొన్నారు. విశాఖ అంటే సుందర నగరం.. కానీ ఈరోజు విశాఖ అంటే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆధిపత్య పోరులో నలిగిపోతున్న నగరమని అన్నారు. ఏళ్ల తరబడి విశాఖలో ఉన్న ఆస్తులను అధికారం ఉపయోగించి అనుచరులకు, అనుయాయులకు అడ్డంగా ఈ విజయసాయిరెడ్డి దోచిపెడుతున్నారని ఆరోపించారు.
Murthy Yadav Fires on MP Vijaya Sai Reddy: తనకి సెంటు భూమి ఉంటే చూపించమని అడిగే విజయ సాయిరెడ్డి.. తన కూతురు, బంధువుల పేరిట భూములు తీసుకున్నారుని అన్నారు. 2019లో మొదలుపెట్టి 2023 మధ్యలో సుమారుగా పదివేల నుంచి 15 వేల కోట్ల రూపాయలు విలువైన భూములు ఒక్క విజయ సాయి రెడ్డి మిత్రులు, బంధువులు, అనుచరుల చేతిలో ఉందని ఆరోపించారు. వ్యాపారం చేస్తున్నానని చెప్తున్నా.. ఈ వ్యాపారం ఒక్క విశాఖలో మాత్రమే చేస్తారా, ఆయన పుట్టిన నెల్లూరులోనూ, రాష్ట్ర రాజధాని అని చెప్పుకునే అమరావతి విజయవాడలోనూ, ఇతర ప్రాంతాలలో ఎందుకు చేయట్లేదని మూర్తియాదవ్ ప్రశ్నించారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తానని.. జరిగిన భూదోపిడీపై విచారణ జరగాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.
"వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తప్పుడు పత్రాలతో 2,800 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. ఇది 100 ఏళ్ల క్రితం రాణి సాహిబా వాద్వాన్ భూమి అంటూ విశాఖ పెద్దజాలరిపేట మత్స్యకార గ్రామంపై అధికారులు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు. క్లైమ్ను పరిశీలించకుండా, న్యాయస్థానాల్లో సవాలు చేయకుండా వేల కోట్ల రూపాయలను అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో 10 శాతం రాణి వారసులు, 90 శాతం విజయ సాయి బృందం పంచుకుంటున్నారు. జరిగిన భూదోపిడీపై విచారణ జరగాలి. దీనిపై న్యాయ పోరాటం చేస్తాను." - పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్
