ETV Bharat / state

Cannabis: ‘ఇకపై మా గ్రామాల్లో గంజాయి సాగు చేపట్టం’

author img

By

Published : Oct 19, 2021, 12:56 PM IST

Updated : Oct 19, 2021, 3:28 PM IST

Gummirevula panchayathi farmers
Gummirevula panchayathi farmers

విశాఖ జిల్లాలోని గుమ్మిరేవుల పంచాయ‌తీ ప‌రిధిలోని 12 గ్రామాల‌కు చెందిన గిరిజ‌న రైతులు సమావేశమై... ఇకపై గంజాయి సాగు చేయకూడదని తీర్మానించారు. పలు గ్రామాల నుంచి కొనుగోలు చేసిన గంజాయి ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో పట్టుబడింది. పోలీసులు రైతులపై కేసులు నమోదు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకన్నారు.

మా గ్రామాల్లో గంజాయి సాగుచేపట్టం

‘తెలిసో తెలియక గంజాయి పండించుకుంటున్నాం.. గంజాయి వ్యాపారం మాత్రం చేయడం లేదు. మేము పండించే సరకు వివిధ రాష్ట్రాల వారు తీసుకెళ్లి పోలీసులకు పట్టుబడితే మా పేర్లు చెబుతుండటంతో మాపై కేసులు నమోదు చేస్తున్నారు. అందువల్ల ఇకపై గంజాయి సాగు చేపట్టబోమని గుమ్మిరేవుల పంచాయతీ గిరిజనుల తీర్మానం చేశారు.

గూడెంకొత్తవీధి మండలంలోని ధారకొండ, గుమ్మిరేవుల పంచాయతీల నుంచి కొనుగోలు చేసిన గంజాయి ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో పట్టుబడింది. తాజాగా పోలీసులు రైతులపై కేసులు నమోదు చేస్తుండటంతో దీనిపై ఆందోళన చెందిన గుమ్మిరేవుల పంచాయతీలోని 12 గ్రామాల గిరిజనులు.. సోమవారం సమావేశమై ఇకపై ఈ సాగు చేపట్టకూడదని నిర్ణయించుకున్నారు. వరి, ఇతర వాణిజ్య పంటలు పండించేందుకు ప్రభుత్వం తమకు నాణ్యమైన విత్తనాలు అందించాలని... పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్‌ చేశారు. సర్పంచి నైని కమలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ నేత ఎస్‌.విష్ణుమూర్తి, ఉప సర్పంచి జోరంగి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: vishaka steel protest: 250వ రోజు ఉక్కు ఉద్యమం.. 25 గంటల నిరవధిక దీక్ష చేపట్టిన కార్మికులు

Last Updated :Oct 19, 2021, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.