ETV Bharat / state

రాయలసీమ బిడ్డలా చెప్పుకునే సీఎం జగన్​.. ద్రోహిలా వ్యవహరిస్తున్నారు: లోకేశ్​

author img

By

Published : Feb 27, 2023, 1:17 PM IST

LOKESH FIRES ON CM JAGAN IN YUVAGALAM
LOKESH FIRES ON CM JAGAN IN YUVAGALAM

LOKESH FIRES ON CM JAGAN IN YUVAGALAM : రాష్ట్రంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ డిమాండ్​ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 29వ రోజు లోకేశ్​ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా తొండవాడలో లోకేశ్‌ బహిరంగ సభ నిర్వహించారు.

రాయలసీమ బిడ్డలా చెప్పుకునే సీఎం జగన్​.. ద్రోహిలా వ్యవహరిస్తున్నారు: లోకేశ్​

LOKESH FIRES ON CM JAGAN : యువగళం దెబ్బతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ బయటకు వస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 29వ రోజు లోకేశ్​ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా తొండవాడలో లోకేశ్‌ బహిరంగ సభ నిర్వహించారు.

రాయలసీమ బిడ్డగా చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌.. రాయలసీమ ద్రోహిలా ప్రవర్తిస్తున్నారని.. నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. సీఎం జగన్‌.. కడప ఉక్కు కర్మాగారాన్ని కేవలం శంకుస్థాపనలకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై సీఎం సహా రాయలసీమ ప్రజాప్రతినిధులెవరూ అడ్డుచెప్పకపోవడం.. వైఎస్సార్​సీపీ వైఖరికి నిదర్శనమన్నారు. నాలుగేళ్లు ఇంటికే పరిమితమైన జగన్ పల్లెనిద్రకు వస్తారట అని లోకేశ్​ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. సొంతవారికి లబ్ధి చేకూర్చేందుకే సిమెంట్‌ ధరను మూడుసార్లు పెంచారని విమర్శించారు.

"సీఎం జగన్​ రాయలసీమ బిడ్డా అన్నాడు. కానీ రాయలసీమకు పట్టిన శని జగన్​ రెడ్డి. నేను మీకు మూడు ఉదాహరణలు ఇస్తా. ఆయన కడపలో ఉక్కు పరిశ్రమకు రెండు సార్లు శంకుస్థాపన చేశాడు. మొదటి శంకుస్థాపన సమయంలో యువతకు 20వేల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కానీ రెండోసారి శంకుస్థాపన చేసినప్పుడు ఉద్యోగాల సంఖ్య ఏకంగా 6వేలకు తగ్గించాడు. ఇది ఆయన కడప జిల్లాకు చేసిన న్యాయం"-నారా లోకేశ్​, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

తిరుమల తిరుపతి దేవస్థాన భూముల విక్రయానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక పేదలను వేంకటేశ్వరస్వామికి దూరం చేశారని మండిపడ్డారు. చెవిరెడ్డి అనుచరులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని.. స్వర్ణముఖి నది నుంచి ఇసుకను దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 300 ట్రాక్టర్లతో ఇసుక, మట్టి తరలిస్తున్నారని నారా లోకేశ్‌ ఆరోపించారు.

"కేంద్ర ప్రభుత్వం కర్నూలులో అప్పర్​ తుంగభద్ర కట్టడానికి 5వేల 3వందల కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే రాయలసీమ.. శాశ్వతంగా రాళ్లసీమగా మారిపోతుంది. కానీ మన రాయలసీమకు చెందిన ఒక్క ఎంపీ కూడా మన హక్కుల గురించి పోరాడటంలేదు. అమరరాజా ఫ్యాక్టరీని వద్దు అంటే.. తెలంగాణకు వెళ్లిపోయింది. అమరరాజా పరిశ్రమ తెలంగాణకు పోవడం వల్ల రాయలసీమమలో 20వేల మంది యువతకు ఉద్యోగాలు పోయాయి"-నారా లోకేశ్​, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

అంతకుముందు నారా లోకేశ్‍ 29వ రోజు యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైంది. చంద్రగిరి మండలం శివగిరి విడిది కేంద్రంలో ప్రారంభమెన పాదయాత్ర శానంబట్ల, పిచ్చినాయుడుపల్లి మీదుగా సాగింది. క్యాంప్ సైట్ వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో లోకేశ్​ మాట్లాడారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.