ETV Bharat / bharat

మేఘాలయ, నాగాలాండ్​లో బారులు తీరిన ఓటర్లు.. ఓటేసిన ముఖ్యమంత్రులు

author img

By

Published : Feb 27, 2023, 7:03 AM IST

Updated : Feb 27, 2023, 1:31 PM IST

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్​, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి.

meghalaya election 2023
meghalaya election 2023

Meghalaya Election 2023 : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్​, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో 60 శాసనసభ స్థానాల చొప్పున ఉన్నాయి. కాగా మేఘాలయలో ఓ అభ్యర్థి మరణించగా.. నాగాలాండ్​లో ఓ నియోజకవర్గం ఏకగ్రీవమైంది. దీంతో రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.

ఓటేసిన ముఖ్యమంత్రులు
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గారో హిల్స్​లోని తురా పోలింగ్ స్టేషన్​లో ఓటు వేశారు. నాగాలాండ్​ ముఖ్యమంత్రి నైఫుయో రియో సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొహిమాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అంతకుముందు మేఘాలయ, నాగాలాండ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవ్వాలని ఆయన ఆకాంక్షించారు. మేఘాలయలో ఉదయం 9 గంటలకు 12 శాతం నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. నాగాలాండ్​లో 15.76 శాతం నమోదైందని తెలిపింది.

Meghalaya Election 2023
ఓటు వేస్తున్న మేఘాలయ ముఖ్యమంత్రి
Meghalaya Election 2023
ఓటు వేస్తున్న నాగాలాండ్ ముఖ్యమంత్రి

మేఘాలయలో అన్ని పార్టీల నుంచి 369 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 21 లక్షల మంది ఓటర్ల కోసం 3,419 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది.

Meghalaya Election 2023
క్యూలో నిల్చున్న ఓటర్లు
Meghalaya Election 2023
క్యూలో నిల్చున్న ఓటర్లు

2018 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 21 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ) 20 సీట్లలో విజయం సాధించింది. ప్రాంతీయ పార్టీలు, భాజపా మద్దతుతో ఎన్​పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్​పీపీ, బీజేపీ విడివిడిగానే పోటీ చేసున్నాయి.

Meghalaya Election 2023
క్యూలో నిల్చున్న ఓటర్లు

మరోవైపు నాగాలాండ్‌లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారికోసం 2,291 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అధికార నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ), భాజపా పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్‌, ఎన్‌పీపీ, ఎన్సీపీ, జేడీయూల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోంది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​పీఎఫ్ 26, భాజపా 12, ఎన్​డీపీపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్​డీపీపీ-భాజపా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

Meghalaya Election 2023
ఓటు వేసేందుకు వేచి చూస్తున్న వృద్ధులు

ఇవీ చదవండి : 59 స్థానాలు.. 369 మంది అభ్యర్థులు.. మేఘాలయలో పోలింగ్​కు సర్వం సిద్ధం

నాగాలాండ్​ ఎన్నికలకు రంగం సిద్ధం.. 59 స్థానాలకు పోలింగ్​.. బరిలో 183 మంది

Last Updated : Feb 27, 2023, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.