ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Dec 15, 2022, 5:00 PM IST

.

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • పిల్లలు లేరనే వంకతో.. కర్నూలులో తోటికోడళ్ల హత్య
    సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. ఆస్తి, డబ్బు కోసం రక్తసంబంధాలనే మట్టిలో కలిపేస్తున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పిల్లలు పుట్టలేదనే కారణంతో తోటికోడళ్లను హత్య చేసిన ఘటన కర్నూలులో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బండరాళ్ల నుంచి క్షేమంగా బయటపడిన రాజు
    తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాల్లో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుని నరకయాతన అనుభవించిన యువకుడు రాజును అధికార యంత్రాంగం రక్షించింది. పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించి అతడిని కాపాడారు. సుమారు 42 గంటల తర్వాత అధికారుల కృషి ఫలించడంతో రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. కండిషన్​ లేకపోవడమే కారణమంటున్న ప్రయాణికులు
    ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనేవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నట్టు ఉన్నాయి. తాజాగా కండిషన్​లో లేని బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశాఖ రైల్వేస్టేషన్​లో అయ్యప్ప భక్తుల ఆందోళన.. ఏమైంది..?
    విశాఖ రైల్వేస్టేషన్​లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. విశాఖ-కొల్లం ఎక్స్‌ప్రెస్‌లో 3 బోగీలు లేవంటూ నిరసన తెలిపారు. రిజర్వేషన్ బోగీలు పెట్టకుంటే.. తాము ఎలా ప్రయాణం చేయాలంటూ వారు నిలదీశారు. అధికారుల తీరును నిరసిస్తూ విశాఖ-కొల్లం ఎక్స్‌ప్రెస్‌ ముందు కూర్చుని ధర్నా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రముఖ నటి హత్య కేసులో ఊహించని మలుపు.. బతికొచ్చి పోలీసుల ముందు ప్రత్యక్షం..
    హాట్​టాపక్​గా మారిన నటి వీణా కపూర్ హత్యకేసు ఊహించని మలుపు తిరిగింది. చనిపోయింది అనుకున్న వీణా కపూర్ బతికి వచ్చారు. తాను హత్యకు గురి కాలేదని బాగానే ఉన్నానంటూ రూమర్స్​కు చెక్​ పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాత వస్తువులతో బుల్లి హెలికాప్టర్ తయారీ​ పెళ్లిళ్లకు అద్దెకిస్తూ సూపర్​ బిజినెస్​
    సాధారణంగా మన ఇంట్లో పనికిరాని పాత వస్తువులు ఉంటే తుక్కు కింద అమ్మేస్తు ఉంటాము. కానీ ఉత్తర్​​ ప్రదేశ్​లోని ఆజమ్​గఢ్​ జిల్లాకు చెందిన ఓ కార్పెంటర్ మాత్రం తన దగ్గర ఉన్న ఉపయోగపడని నానో కార్​తో ఏకంగా రోడ్డుపై నడిచే హెలికాప్టర్​ను తయారు చేశాడు. అంతేగాక దీనిని పెళ్లి బరాత్​ వంటి శుభకార్యాలకు అద్దెకు ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. కేవలం ఇంటర్​ మాత్రమే చదివిన కార్పెంటర్ సల్మాన్​ నూతన ఆవిష్కరణలకు ఉన్నత చదువులతో సంబంధం లేదని నిరూపించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నడిరోడ్డుపై ప్రేయసిని దారుణంగా చంపిన ప్రియుడు.. అలా చేసిందన్న కోపంతో..
    ప్రేయసి తనను వదిలేసిందన్న కోపంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పట్టపగలే నడిరోడ్డుపై హతమార్చాడు. కేరళలో జరిగిందీ ఘటన.
    పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఉగ్రదాడులు చేస్తూ.. సంబరాలా?'.. ఐరాస వేదికగా పాక్, చైనాలకు జైశంకర్ చురకలు
    ఐరాస భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్, చైనాలకు పరోక్షంగా చురకలు అంటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదనలకు వీటో అధికారంతో చైనా పదేపదే అడ్డుపడడంపై అభ్యంతరం తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కేఎల్​ రాహుల్​పై దినేశ్​ కార్తిక్ కామెంట్స్​​.. అలా అనేశాడేంటి?
    బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా కేఎల్ రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై దనేశ్ కార్తిక్​ స్పందించాడు. అలా అనడం కరెక్ట్ కాదని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • RRR Movie: 'ఆ విషయం గురించి ఏడాదిన్నర తర్వాతే తెలిసింది'
    'ఆర్​ఆర్​ఆర్'​ మూవీలోని సాంగ్ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపాడు సింగర్ సిప్లిగంజ్​. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.