పాత వస్తువులతో బుల్లి హెలికాప్టర్ తయారీ​ పెళ్లిళ్లకు అద్దెకిస్తూ సూపర్​ బిజినెస్​

By

Published : Dec 15, 2022, 4:38 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

సాధారణంగా మన ఇంట్లో పనికిరాని పాత వస్తువులు ఉంటే తుక్కు కింద అమ్మేస్తు ఉంటాము. కానీ ఉత్తర్​​ ప్రదేశ్​లోని ఆజమ్​గఢ్​ జిల్లాకు చెందిన ఓ కార్పెంటర్ మాత్రం తన దగ్గర ఉన్న ఉపయోగపడని నానో కార్​తో ఏకంగా రోడ్డుపై నడిచే హెలికాప్టర్​ను తయారు చేశాడు. అంతేగాక దీనిని పెళ్లి బరాత్​ వంటి శుభకార్యాలకు అద్దెకు ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. కేవలం ఇంటర్​ మాత్రమే చదివిన కార్పెంటర్ సల్మాన్​ నూతన ఆవిష్కరణలకు ఉన్నత చదువులతో సంబంధం లేదని నిరూపించాడు. ఈ నానో హెలికాప్టర్​కు అమర్చిన రంగురంగుల లైట్లు రాత్రి వేళ్లల్లో చూపరులను మరింతగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా వివాహ సమయాల్లో పెళ్లి కొడుకును ఊరేగించేందుకు దీనిని ముందస్తుగా బుక్​ చేసుకుంటున్నారు స్థానికులు. దీని అద్దె ధరలను రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు తీసుకుంటున్నాడు. ఈ కార్ హెలికాప్టర్​లో డ్రైవర్​తో సహా నలుగురు కూర్చోవచ్చని చెబుతున్నాడు​. ఈ హెలికాప్టర్​ను తయారు చేయడానికి రూ.3 లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపాడు. ప్రస్తుతం ఈ నానో హెలికాప్టర్​ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.