ETV Bharat / health

యువకులు స్మోకింగ్​కు ఎందుకు అలవాటు పడతారు? - దాన్ని ఎలా అడ్డుకోవాలి? - Causes of Nicotine Addiction

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 9:34 AM IST

Nicotine Addiction: "స్మోకింగ్​ ఈజ్​ ఇన్​జ్యూరియస్​ టు హెల్త్​" ఈ విషయం అందరికీ తెలుసు. అయినా చాలా మంది దీన్ని వదలడం లేదు. అంతేకాదు.. కొత్త తరం యువత ఈ ఊబిలో పడిపోతూనే ఉన్నారు.. బానిసలుగా మారుతూనే ఉన్నారు. మరి.. యువత స్మోకింగ్​కు ఎందుకు అలవాటు పడుతుంది? దాన్ని ఎలా అడ్డుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

Nicotine Addiction
Why Do Youth get Addicted to Nicotine (ETV Bharat)

Why Do Youth get Addicted to Nicotine: ఫ్యాషన్, స్టైల్, రిలాక్సేషన్, సరదా.. ఇలా రకరకాల కారణాలతో చాలా మంది స్మోకింగ్​కు అలవాటు పడుతున్నారు. క్యాన్సర్​ కారకం.. ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా ఈ అలవాటు మానుకోలేకున్నారు. అసలు యువత స్మోకింగ్​కు ఎందుకు అలవాటు పడతారు? దాన్ని ఎలా అడ్డుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా పొగాకులోని నికోటిన్‌ మెదడులో డోపమైన్‌ అనే రసాయనం విడుదలయ్యేలా చేస్తుంది. ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. క్రమ క్రమంగా మరింత ఎక్కువ నికోటిన్‌ తీసుకునేలా చేస్తుంది. చివరికిదొక వ్యసనంగా మారుతుంది. పొగ తాగటం మానేసినప్పుడు శరీరంలో నికోటిన్‌ తగ్గుతుంది. అప్పుడు నిరాశా, నిస్పృహ వంటి లక్షణాలు మొదలవుతాయి. దీంతో చాలామంది తిరిగి సిగరెట్లు కాల్చటం మొదలు పెడుతుంటారు.

యువకులు స్మోకింగ్​కు అలవాటు పడటానికి కారణాలు:

వయసు: చిన్న వయసులో ఏదైనా కొత్తదాన్ని ట్రై చేయాలనే కోరిక సహజంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే.. పక్కవాళ్లు, తెలిసిన వాళ్లు పొగతాగడాన్ని చూసి.. సినిమాల్లో అభిమాన హీరోలు స్టైల్​ గా సిగరెట్ తాగడాన్ని చూసి.. యువత కూడా స్మోకింగ్ చేస్తుంటారని.. వారి​ అలవాటుకు ఇది కూడా ఓ కారణమని డాక్టర్ కుల్దీప్ కుమార్ గ్రోవర్ అంటున్నారు.

స్నేహితులు, కుటుంబ సభ్యులు: చాలా మంది యువకులు తమ స్నేహితులు, కుటుంబసభ్యుల్లో ధూమపానం చేసే వారిని చూసి ప్రేరేపితులవుతారు. ఈ క్రమంలో వారితో కలిసి స్మోకింగ్​ అలవాటు చేసుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారు ధూమపానం చేస్తున్నప్పుడు, అలా చేయడం కామన్​ అనే భావన మీలో కలిగి స్మోకింగ్​ను అలవాటు చేసుకుంటారని అంటున్నారు.

నో స్మోకింగ్​ డే - ఈ టిప్స్​ పాటిస్తే సిగరెట్​ అస్సలు ముట్టుకోరు!

మానసిక ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, స్కిజోఫ్రెనియా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు స్మోకింగ్​కు ఎక్కువగా ఎడిక్ట్​ అవుతారని అంటున్నారు. 2009లో అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. డిప్రెషన్ ఉన్న వ్యక్తులు స్మోకింగ్ చేసే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​లో ప్రొఫెసర్ డాక్టర్​ రాబర్ట్ జె. హౌస్ పాల్గొన్నారు.

స్మోకింగ్​ అలవాటు మానుకోవడం ఎలా?:

  • సిగరెట్‌ తాగాలని అనిపించినప్పుడల్లా హెల్దీ స్నాక్స్​ తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్లు తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక చచ్చిపోతుందని అంటున్నారు.
  • మీరు సిగరెట్ తాగడం మానేయాలని అనుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్​కు చెప్పండి. ఇలా చేస్తే వారి ముందు ప్రామిస్ చేశాం కాబట్టి, మాట నిలబెట్టుకోవాలనే కారణంతో పొగతాగడం మానేసే అవకాశం ఉందని అంటున్నారు.
  • స్మోకింగ్‌ మానేయడానికి ప్రోత్సహించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు తమతో పాటు పొగ మానేసేవారిని సెలెక్ట్​ చేసుకోవాలి.
  • స్మోకింగ్ మానాలంటే దాని నుంచి మైండ్ డైవర్ట్ చేయాలి. అలా చేయాలనుకుంటే నికొటిన్ రిప్లేస్​మెంట్ థెరపీ (ఎన్​ఆర్​టి) ప్రయత్నించాలి. అందుకోసం మీ డాక్టర్​ను సంప్రదించి వారు సూచించే టిప్స్​ ఫాలో అవ్వడం మంచిది.
  • ఒక వ్యక్తికి ప్రతి గంటకూ సిగరెట్ తాగే అలవాటు ఉందనుకుంటే ఇకపై అలా కాకుండా ఆ సమయాన్ని 5 నిమిషాలకు పెంచాలి.
  • అంటే ఉదాహరణకు మీరు గంట క్రితం సిగరేట్ తాగితే మరో గంట కాగానే స్మోక్ చేయకుండా ఐదు నిమిషాలు వెయిట్ చేయడానికి ట్రై చేయాలి.
  • ఇలా స్మోకింగ్ సెషన్ల మధ్య విరామాన్ని పెంచుకుంటూ పోతే ఈ వ్యసనాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది.

ఎంత ట్రై చేసినా స్మోక్ చేయడం మానలేకపోతున్నారా?- ఈ టిప్స్​ ట్రై చేస్తే అస్సలు తాగరు!

ఆ సమయంలో స్మోకింగ్​ చేస్తే.. పిల్లల్లో అంగవైకల్యం వస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.