భారతి సిమెంట్ వాహనాలతో అనారోగ్య సమస్యలు - మహిళల ఆందోళన - Protest on Vehicles Dust Problem

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 8:01 PM IST

thumbnail
'భారతి సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చే వాహనాల వల్ల అనారోగ్య సమస్యలు'- మహిళల ఆందోళన (ETV Bharat)

Women Protest Against Vehicles Dust Problem: వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో మహిళలు ఆందోళన చేపట్టారు. భారతి సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చే వాహనాల కారణంగా దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ దుకాణదారులు, నివాస గృహాల వారు అటుగా వచ్చిన వాహనాలను ఆపివేశారు. ఇటు నుంచి వెళ్లే వచ్చే వాహనాలు వల్ల దారి పక్కనే ఉన్న దుకాణాలు, తమ ఇళ్లలోకి దుమ్ము ఎక్కువగా చేరి తాము అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం, భారతీ సిమెంట్ యాజమాన్యం తమకు దుమ్ము రాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. 

"భారతి సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చే వాహనాల కారణంగా దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటు నుంచి వెళ్లే వచ్చే వాహనాలు వల్ల దారి పక్కనే ఉన్న మా దుకాణాలు, ఇళ్లలోకి దుమ్ము చేరిపోతోంది. దీనివల్ల మేము తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నాం. దీనిపై ఇప్పటికై ప్రభుత్వం, భారతీ సిమెంట్ యాజమాన్యం స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాం." - స్థానికులు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.