ETV Bharat / entertainment

RRR Movie: 'ఆ విషయం గురించి ఏడాదిన్నర తర్వాతే తెలిసింది'

author img

By

Published : Dec 15, 2022, 3:56 PM IST

'ఆర్​ఆర్​ఆర్'​ మూవీలోని సాంగ్ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపాడు సింగర్ సిప్లిగంజ్​. ఆ వివరాలు..

Rahul Sipligunj
RRR Movie: 'ఆ విషయం గురించి ఏడాదిన్నర తర్వాతే తెలిసింది'

నాటు పాటలు పాడి రికార్డుల మోత మోగించడంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ స్టైలే వేరు. ట్రెండ్‌కు తగ్గ తన పాటలతో అలరిస్తూ యూత్‌కు దగ్గరైన ఈ యంగ్‌ టాలెండెట్‌ పర్సన్స్‌ 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరై తన కెరీర్​ గురించి ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఇందులో భాగంగానే ఆర్​ఆర్​ఆర్​ మూవీలోని సాంగ్ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపాడు. అదేంటో తెలుసుకుందాం..

ఏడాది తర్వాత తెలిసింది.. నాటునాటు పాట నేను, కాలభైరవ కలిసి పాడాం. పాడుతున్నప్పుడు కీరవాణి గారు చాలా ట్యూన్స్‌ చేస్తారు. అలా ట్యూన్స్‌కు పాడుతున్నప్పుడు ఈ పాట లిరిక్స్‌ను చూసి ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ పాట అని అర్థమైంది. ఆ పాట పాడుతున్నప్పుడు 'ఇది ఫైనల్‌ కాదు.. ట్రాక్‌ మాత్రమే' అని కీరవాణి గారు చెప్పారు. నేను పాడిన తర్వాత ఏడాదిన్నరకు రిలీజ్‌ అయింది ఆ పాట. రిలీజ్‌ అయ్యే వరకు తెలీదు నేను పాడిన పాటే ఫైనల్‌ అవుతుందని.. విచిత్రం ఏంటంటే తెలుగులోనే కాదు.. తమిళ్‌, కన్నడ, హిందీలోనూ నేను పాడిన పాటే సినిమాలో ఉంచారు. తెలుగులో పాడిన తర్వాత వల్లీ మేడం(కీరవాణి సతీమణి) ఫోన్‌ చేసి ఒకసారి తమిళ్ వెర్షన్‌కు కూడా పాడమన్నారు. అలా మిగతా భాషల్లో కూడా ఓకే అయింది. కీరవాణి గారు నాకు ఈ పాట పాడే అవకాశం ఇవ్వడమే పెద్ద ప్రశంస.

పాట నాది క్రెడిట్ ఇంకొకరిది.. ఓ సారి నేను రచ్చ సినిమాలో 'సింగరేణి ఉంది..' పాట పాడాను. కానీ పేరు మాత్రం వేరే సింగర్‌ది ఉంటుంది. దానికి కారణం.. సినిమా రిలీజ్‌కు 2 రోజుల ముందు నాతో పాడించారు. కానీ అప్పటికే సీడీలపై పేర్లు ప్రింట్‌ అయ్యాయి.

నో లవ్​స్టోరీస్​.. ఇక పోతే నేను లయోలా స్కూల్‌లో చదివాను. ఇంటర్‌ నారాయణ కాలేజీలో చదివాను. రెండు సంవత్సరాలు చదవడానికి.. మరో రెండేళ్ల పాస్‌ అవ్వడానికి పట్టింది (నవ్వుతూ). అలా ఇంటర్‌కు నాలుగేళ్లు పట్టింది. ఇకపోతే నాకు ఏ లవ్​స్టోరీలు లేవు. నాకు ఎవరు పడతారు. ఇంకా బిజినెస్ విషయానికొస్తే.. త్వరలో బిజినెస్‌ మొదలు పెట్టనున్నా. అమెరికాలో హోటల్‌ పెట్టడానికి అన్నీ రెడీ అయ్యాయి. త్వరలోనే స్టార్ట్‌ చేయబోతున్నా.

నాలో సింగర్​ని ఆయనే గుర్తించారు.. రాహుల్‌ సిప్లిగంజ్‌: నేను మొదటిసారి 'నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి' సినిమాలో పాడాను. తర్వాత అనూప్‌ రూబెన్స్‌కు పాడాను. దమ్ము సినిమాలోని పాటకు నాకు సింగర్‌గా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈగ, మర్యాదరామన్న, తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ఇలా కీరవాణి గారి దగ్గర పాడుతూ వచ్చాను. తాజాగా నాని నటిస్తున్న 'దసరా' సినిమాలో పాడాను. నాలో పాటలు పాడాలనే తపన ఉందని మా నాన్న గుర్తించారు. అలా మా తాతగారు ఆయనకు తెలిసిన వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లి సంగీతంలో మెళకువలు నేర్పించారు.

ఇదీ చూడండి: నాకు పవన్​ కల్యాణ్​ మధ్య గ్యాప్​ ఎలా వచ్చిందంటే: అలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.