ETV Bharat / state

బైపాస్ కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు దీక్ష.. జనం నమ్మడం లేదన్న జనసేన

author img

By

Published : Apr 12, 2023, 9:07 PM IST

Etv Bharat
Etv Bharat

Kasu Mahesh Reddy: పిడుగురాళ్ల బైపాస్ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. పల్నాడు జిల్లా తుమ్మలపాలెం టోల్‌గేట్ వద్ద గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 2022 జనవరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పిన క్యూబ్ సంస్థ విఫలమైందని మండిపడ్డారు. జూన్ 30 లోగా నిర్మాణ పనులను పూర్తిచేస్తామని క్యూబ్ సంస్థ హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. ఇదే అంశంపై పల్నాడు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు స్పందించారు. కేవలం ఎన్నికల కోసమే ఎమ్మెల్యే దీక్ష చేపట్టారని విమర్శించారు.

Piduguralla bypass road: పిడుగురాళ్ల బైపాస్ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. పల్నాడు జిల్లా తుమ్మలపాలెం టోల్‌గేట్ వద్ద గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి రిలే నిరాహార దీక్ష చేశారు. 2022 జనవరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పిన క్యూబ్ సంస్థ విఫలమైందని మండిపడ్డారు. మరోవైపు పిడుగురాళ్లలో విపరీతమైన ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... ఎన్నోసార్లు గుత్తేదారు సంస్థ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. జూన్ 30 లోగా నిర్మాణ పనులను పూర్తిచేస్తామని క్యూబ్ సంస్థ హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు.

కాసు మహేశ్ రెడ్డి వర్సెస్ గాదె వెంకటేశ్వరరావు

జనసేన: ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి దీక్షపై పల్నాడు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు స్పందించారు. బైపాస్​ విషయంలో అధికారంలో రాకముందు ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో బైపాస్ పూర్తి చేస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడంటూ గాదె విమర్శించాడు. అధికార పార్టీలో ఉన్నా ఇంతవరకు ఎందుకు స్పందించలేదని విమర్శించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 45 నెలల అనంతరం దొంగ దీక్షలకు దిగారని విమర్శించారు. మాట తప్పి.. దీక్షకు దిగితే ప్రజలు కాసు మహేష్ రెడ్డిని నమ్ముతారా..? అంటూ ప్రశ్నించారు.
దశాబ్దకాలంగా పూర్తి చేయలేని పిడుగురాళ్ల బైపాస్​ను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పారని గాదె గుర్తుచేశారు. ఈ ఆరునెలల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని, అందుకే ఎమ్మెల్యే ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేవలం ఆరు కిలోమీటర్లు హైవే పూర్తి చేయలేని నిస్సహాయ స్థితిలో వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఉన్నారని దుయ్యబట్టారు. ప్రతి అంశానికి తొడలు కొట్టడం..మీసాలు తిప్పడం.. కాదని, ప్రజా సమస్యలను తీర్చే విషయంలో చిత్తశుద్ధి ఉండాలని విమర్శించారు.

ఎక్కడైనా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిరాహారదీక్ష చేస్తారా అంటూ గాదె ప్రశ్నించారు? ప్రతి వారం వచ్చి ఆదాయ లెక్కలు చూసుకుని సూట్కేసులు నింపుకొవడంపై ఉన్న శ్రద్ధ బైపాస్ విషయంలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డికి ఎందుకు లేదని విమర్శించారు. బై పాస్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని జనసేన నాయకులతో కలిసి పర్యటించారు. గాదె మరో ఆరునెలలు సమయం ఇచ్చినా పూర్తి చేయలేరని అన్నారు. ఇదే అంశంపై ప్రశ్నించేందుకు మేము వస్తున్నామని తెలిసి.. ఈ లోపే దీక్ష విరమించి ఎమ్మెల్యే వెళ్లాడని, కాబట్టి ఇదంతా కూడా తూతూ మంత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.