ETV Bharat / state

Municipal Workers Maha Dharna in Vijayawada: హామీలు నెరవేర్చాలంటూ.. మున్సిపల్ కార్మికుల చలో విజయవాడ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 4:08 PM IST

Municipal Workers Maha Dharna in Vijayawada
municipal_workers_maha_dharna_in_vijayawada

Municipal Workers Maha Dharna in Vijayawada: సమస్యలను పరిష్కారించాలంటూ సీఐటీయూ చలో విజయవాడకు పిలుపునివ్వగా.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

Municipal Workers Maha Dharna in Vijayawada: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడకు సీఐటీయూ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పారిశుధ్య కార్మికులు తరలివచ్చారు. విజయవాడ ధర్నా చౌక్​లో పారిశుధ్య కార్మికులు మహాధర్నా చేపట్టారు. మాటతప్పను, మడమతిప్పను అన్న ముఖ్యమంత్రి తమకు తీవ్ర అన్యాయం చేశారని కార్మికులు మండిపడ్డారు.

Municipal Workers Maha Dharna in Vijayawada: హామీలు నెరవేర్చాలంటూ.. మున్సిపల్ కార్మికుల చలో విజయవాడ

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందజేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు తమను క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మున్సిపల్ కార్మికులు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంటు చార్జీలు, చెత్త పన్నులు వంటి భారాలను ఎడాపెడా మోపుతుందని దుయ్యబట్టారు.

Municipal Workers Agitation: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు.. సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనలు

నిత్యావసర సరుకుల ధరలు చుక్కలంటుతుంటే తమకు ఇచ్చే 10 వేల నుంచి 13వేల రూపాయలతో కుటుంబాలను ఎలా పోషించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలీచాలని వేతనాలతో ఇళ్లు అద్దెలు, పిల్లల చదువులు ఎలా సాగుతాయన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలను కోత పెట్టారని దుయ్యబట్టారు. కార్మికులందరినీ ఆప్కాస్ లో ఉద్యోగులుగా నమోదు చేసి 60 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు.

పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్య పెంచడం లేదంటున్నారు. పనిచేస్తున్న వారిపైనే అదనపుభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంతో సహా విలీన గ్రామాల కార్మికులకు ఏళ్ల తరబడి పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు. ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రిస్క్ హెల్త్ అలవెన్స్ చెల్లించడం లేదని మండిపడ్డారు.

Sanitation Workers Protest in Madasikara: మడకశిరలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. కార్యాలయానికి తాళం

క్లాప్ డ్రైవర్లకు జీవో ఎంఎస్ నెంబర్ ఏడు ప్రకారం 18 వేల 500 రూపాయలు జీతం చెల్లించకుండా కేవలం 9 నుంచి 13 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ నాయకులు దుయ్యబట్టారు.

సమస్యల పరిష్కారం చేయలని ఆందోళనకు పిలుపునిస్తే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మున్సిపల్ కార్మికులను, సీఐటీయూ నేతలను అరెస్ట్ చేయడం అన్యాయమని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు విమర్శించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులు హెచ్చరించారు.

Contract Employees Protest: "సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే.. నిరవధిక సమ్మెకు సిద్ధం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.