ETV Bharat / state

నంద్యాలలో.. శిథిలావస్థలో టిడ్కో ఇళ్లు

author img

By

Published : Feb 8, 2023, 1:53 PM IST

tidco houses
టిడ్కో ఇళ్ళు

Bhuma Brahmananda Reddy: నంద్యాలలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వైఎస్సార్​సీపీ అధికారంలోకి రాగానే గతంలో ఇచ్చిన లబ్ధిదారులను పక్కనబెట్టి నూతనంగా వేరే వాళ్లకు కేటాయిచారు. ఇళ్లకు వైఎస్సార్​సీపీ రంగులు వేశారు. కానీ మౌలిక వసతులు కల్పించడం మర్చిపోయారు.

టిడ్కో ఇళ్ళుపై స్పందించిన భూమా బ్రహ్మానందరెడ్డి

TIDCO houses in Nandyal: నంద్యాలలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు నేటికి పూర్తిస్థాయిలో లబ్దిదారులకు పంపిణీకి నోచుకోలేదు. గడిచిన నెలలో మొక్కుబడిగా కొన్నింటిని పంపిణీ చేశారు. వాటిలో చేరేందుకు లబ్దిదారులు ముందుకు రాలేదు. కారణం మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇంటికి విద్యుత్ తాగునీటి సరఫరాతో పాటు మరిన్ని రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని దృష్టి సారించాల్సి ఉండగా మూడున్నర ఏళ్లలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను విస్మరించి రంగులు వేసి అదనపు ఖర్చు చేశారు.

నంద్యాలలో ఎస్సార్బీసీ, వైఎస్.నగర్, అయ్యలూరుమెట్ట ప్రాంతాల్లో పదివేల ఇళ్లు నిర్మించారు. సదుపాయాలు కరువైన ఈ వేల ఇళ్ల కోసం లబ్దిదారుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాయి. గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లను కేటాయించక పోవడం దారుణమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు.

'నంద్యాలలో పేద ప్రజలకు ఇళ్లను కట్టించాలన్న భూమా నాగిరెడ్డిగారి కోరిక. ఈ మేరకు టీడీపీ ప్రభుత్వం అప్పటికే 10 వేల ఇళ్లు కట్టించారు. అందులో 8వేల మందికి ఇళ్లను కేటాయించారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఇళ్ల నుంచి వేయి ఇళ్లను మాత్రమే పంచింది. గతంలో టీడీపీ ఇచ్చిన ఇళ్లను సైతం మళ్లీ వేరే వాళ్లకి ఇచ్చారు. గతంలో ఇళ్లు ఎలాగ ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడున ప్రభుత్వం గతంలో టీడీపీ సమయంలో కట్టించిన ఇళ్లకి రంగులు వేసుంది. ఆ ఖర్చులు ప్రజలకు మౌలిక సదుపాయలను కల్పించేందుకు ఉపయోగిస్తే బాగుండేది.'- భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.