ETV Bharat / state

సంక్షేమ పథకాలు అందాయా.. ఇంటికి స్టిక్కర్​ పడాల్సిందే

author img

By

Published : Feb 7, 2023, 10:22 PM IST

Why Not 175: ఎన్నికలకు సమయం ఆసన్నమవ్వడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. సంక్షేమ పథకాలు తీసుకున్నవారు మరచిపోకుండా ఉండటానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా అలాగైతే ఈ స్టికర్ ఉండాల్సిందేనండీ బాబూ..

Etv Bharat
Etv Bharat

Why Not 175: ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు తమ పాలసీలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పలు కార్యక్రమాలు చేపడతాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తుపెట్టకునే విధంగా ఉండాలనీ అధికార పార్టీ కొత్త కార్యక్రమానికి ఆహ్వానం పలికింది. ఈ నెల 11న మరో కొత్త కార్యక్రమం ప్రారంభించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. సంక్షేమ పథకాలు అందుకుంటోన్న వారి ఇళ్లకు.. సీఎం జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్​ను అతికించాలని నిర్ణయించారు. ఏ ఇంటికి పథకాలు అందుతున్నాయన్న వివరాలు సేకరించి.. ఆ ఇంటికి జగన్ స్టిక్కర్ వేయనున్నారు. పార్టీపరంగా నియమించిన గృహసారథులు, స్థానిక వాలంటీర్లు సమన్వయం చేసుకుని ఇళ్లు గుర్తించి ఇంటి డోర్​కు స్టిక్కర్లు అతికించనున్నారు.

''మా నమ్మకం నువ్వే జగన్" అనే టాగ్ లైన్​తో సీఎం జగన్, వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ కల్గిన ప్రత్యేక స్టిక్కర్లు వేయనున్నారు. ఇంటి యజమాని అనుమతితో మాత్రమే స్టిక్కర్ వేయాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.