ETV Bharat / state

రెండోసారి టెండరు ప్రకటనకూ స్పందన కరవు

author img

By

Published : Sep 16, 2021, 9:07 AM IST

మచిలీపట్నం పోర్టు
Machilipatnam Port

సహజంగా ప్రాజెక్టులను పోటీపడి దక్కించుకుంటాయి గుత్తేదారు సంస్థలు. అందుకు విరుద్దంగా.. పిలిచి భారీ ప్రాజెక్టు ఇస్తామన్నా వద్దు పొమ్మంటున్నాయి. కనీసం ఒక్క సంస్థ అయినా ముందుకు వస్తుందని ఎదురు చూసిన అధికారులకు నిరాసే మిగిలింది.

భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులను దక్కించుకోవటానికి గుత్తేదారులు పోటీపడటం మనం ఇప్పటి వరకు చూశాం. అదేం విచిత్రమో.. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను పిలిచి ఇస్తామన్నా ఒక్క గుత్తేదారు సంస్థ కూడా స్పందించటం లేదు. ఇలా ఒకసారి జరిగితే సమాచార లోపమని సరిపెట్టుకోవచ్చు. మొదటిసారి పిలిచిన టెండర్లకు గుత్తేదార్ల నుంచి స్పందన రాలేదని మరోమారు ప్రయత్నించారు. రెండోసారీ అదే తీరు ఉండటంతో అధికారులే విస్తుపోతున్నారు. కనీసం ఒక్క సంస్థ ముందుకు వచ్చినా సంప్రదింపులు జరిపి, పనులు అప్పగించాలని భావించిన ఏపీ మారిటైం బోర్డుకు మళ్లీ నిరాశే ఎదురైంది. టెండరు వేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మరో రెండు వారాలు గడువు పెంచాలని బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులను చేపట్టడానికి నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఒక అధికారి పేర్కొన్నారు.

మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులను రూ.5,835 కోట్లతో చేపట్టడానికి రైట్స్‌ సంస్థ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను 2020 ఆగస్టు 31న ప్రభుత్వం ఆమోదించింది. యాజమాన్య పద్ధతిలో పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. టెండర్లు పిలవటానికి ఏపీ మారిటైం బోర్డుకు అనుమతిచ్చింది.

ఇదీ చదవండీ.. మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీ ఎనిమిదో స్థానం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.