ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Nov 12, 2022, 6:58 PM IST

AP TOP NEWS
AP TOP NEWS

.

  • PM Modi in Ramagundam : 'సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచనే కేంద్రానికి లేదు'
    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామగుండం పర్యటన సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని.. ఎన్టీపీసీ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన మోదీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదనే తీయని మాటను చెప్పారు. సింగరేణి సంస్థలో అధిక వాటా రాష్ట్ర సర్కార్‌కు ఉన్నప్పుడు దాన్ని కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైకాపాలో వర్గపోరు.. మంత్రి రోజాకు తప్పని నిరసనలు
    మంత్రి రోజాకు సొంత పార్టీ నాయకుల నుంచి నిరసనలు తప్పడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఉద్రిక్తతల మధ్య తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పత్తిపుత్తూరు గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రధానమంత్రిని జగన్​ గట్టిగా అడగకుండా.. ప్రాధేయపడటం సరికాదు: బీవీ రాఘవులు
    రాష్ట్రానికి ఏంకావాలో ప్రధానమంత్రిని గట్టిగా అడగకుండా.. ముఖ్యమంత్రి జగన్ ప్రాధేయపడటం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. అది కూడా తెలుగులో అడిగితే ప్రధానికి ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మోదీ పర్యటన వేళ విశాఖలో ట్రాఫిక్​కు అంతరాయం..
    ప్రధాని విశాఖ పర్యటన వేళ నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాహనాల వల్ల నగర వాసులు ఇబ్బందులు పడారు. సభ ముగిశాక, బయటకు వచ్చే జనం నేరుగా హైవే మీదకు చేరుకోవడంతో ట్రాఫిక్​ను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆ స్టేడియానికి మోదీ పేరు తీసేస్తాం.. 10లక్షల ఉద్యోగాలిస్తాం'.. కాంగ్రెస్ మేనిఫెస్టో
    భాజపా కంచుకోట గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్రమోదీ మైదానం పేరు మారుస్తామని హామీ ఇచ్చింది. 10 లక్షల ఉద్యోగాల కల్పన, మహిళలకు పీజీ వరకు ఉచిత విద్య, రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ, 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి హామీలు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అప్పు తీర్చేందుకు చిన్నారి అమ్మకం.. డబ్బు కోసం స్నేహితుడిని కిడ్నాప్ చేసి..
    అప్పు తీర్చేందుకు తమ నవజాతశిశువును అమ్మేందుకు సిద్ధమయ్యారు దంపతులు. ఈ హృదయవిదారక ఘటన బిహార్​లో వెలుగుచూసింది. మరోవైపు, డబ్బుల కోసం ఓ వ్యక్తిని అతడి స్నేహితులే కిడ్నాప్ చేశారు. అనంతరం బాధితుడిపై దాడి చేసి అడవిలో పడేశారు. ఈ దారుణం మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఖేర్సన్‌లో రష్యా బలగాల తరలింపు పూర్తి.. ఉక్రెనియన్ల విజయోత్సాహం
    ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలగుతున్నట్లు రష్యా సైన్యం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు మాస్కో శుక్రవారం వెల్లడించింది. దీంతో ఖేర్సన్​లో ఉక్రెనియన్ల విజయోత్సాహం వెల్లువెత్తింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంటి లోన్​ కోసం క్రెడిట్​ స్కోర్​ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ మీకోసమే!
    ఇటీవలి కాలంలో హోమ్​ లోన్స్​ కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య విరివిగా పెరిగింది. కానీ ఈ రుణాలను పొందేందుకు తగిన క్రెడిట్​ స్కోర్​ అవసరం ఉంటుంది. అయితే అసలు ఈ క్రెడిట్​ స్కోరు ఏంటి? అది ఎలా సహాయం చేస్తుంది, వాటిని పెంచేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 World Cup: టీమ్​ఇండియాకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా?
    టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలై ఇంటి బాట పట్టింది. అయితే భారత క్రికెట్​ జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జిమ్​లో వర్కౌట్స్​ చేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయిన నటులు వీరే
    ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న వయసులోనే తనువు చాలిస్తున్న ప్రముఖులను సైతం మనం చూస్తున్నాం. ఆహారపు అలవాట్లతో పాటు జిమ్​ వర్కౌట్స్​​ కూడా అకస్మాత్తు మృతికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. శుక్రవారం మరణించిన ప్రముఖ సీరియల్​ నటుడు సిద్ధాంత్​ సూర్యవంశీ కూడా జిమ్​లోనే కుప్పకూలిపోయారు. ఇదే తరహాలో కన్నడ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ సైతం తుది శ్వాస విడిచారు. ఇలా అర్ధంతరంగా అనంతలోకాలకు వెళ్లిపోయిన తారలు వీరే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.