ETV Bharat / state

సత్య ప్రమాణాలకు నిలయం.. తరిగొండ నరసింహుని ఆలయం

author img

By

Published : Mar 7, 2020, 5:59 PM IST

అసత్యవాదుల పాలిట ధర్మపీఠం తిరుపతిలోని తరిగొండ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. అబద్ధాన్ని నిజంగా నిరూపించాలనుకున్న వారికి ఈ ఆలయం పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఆ ఆలయ విశేషాలు మనమూ తెలుసుకుందామా..!

tarigonda sri laxmi narasimha swamy temple
తరిగొండ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

సత్య ప్రమాణాలకు నిలయంగా నరసింహుని ఆలయం

చిత్తూరు జిల్లాలోని తరిగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. అసత్యవాదులకు ఈ ఆలయ పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుంది. వివిధ గ్రామాల పెద్దలు ఎవరైనా అసత్యం చెప్పారు అని అనిపిస్తే ఈ ఆలయానికి తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహుని దుర్వాస మహాముని ప్రతిష్ఠించారు. ఆలయంలో ఎవరైనా అసత్య ప్రమాణం చేస్తే వారి వంశం నిర్వీర్యం అవుతుందని మహాముని శపించారని పురాణ కథనం. ఇప్పటికీ ఆ ముని శాపం ఫలిస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయంలో అసత్య ప్రమాణం చేసిన చాలా మంది ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

గజ వాహనంపై ఊరేగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.