ETV Bharat / sports

ఐపీఎల్ ముందు సునీల్ నరైన్ సంచలనం.. 7 ఓవర్లు.. 7 మెయిడెన్లు.. 7 వికెట్లు

author img

By

Published : Mar 20, 2023, 5:28 PM IST

Updated : Mar 20, 2023, 6:00 PM IST

ఐపీఎల్‌-2023 సీజన్​కు ముందు కేకేఆర్‌ స్టార్‌ ప్లేయర్​ సునీల్‌ నరైన్‌ సంచలన ప్రదర్శన చేశాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్​లో 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 7 మెయిడెన్లతో 7 వికెట్లు తీయడం విశేషం. ఆ వివరాలు..

sunil narine 7 wickets
సునీల్​ నరైన్​ ఏడు వికెట్లు

ఐపీఎల్‌-2023 సీజన్‌ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగాలీగ్​ కోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ సీజన్​కు ముందు క్రికెట్​ అభిమానులతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్​కు కిక్కిచ్చే వార్త ఒకటి. అదేంటంటే.. ​ వెస్టిండీస్‌ సీనియర్​ ఆల్‌రౌండర్‌, కోల్​కతా నైట్​ రైడర్స్​ స్టార్‌ ప్లేయర్​ సునీల్‌ నరైన్‌ సూపర్​ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. తాజాగా జరిగిన ట్రినిడాడ్ అండ్‌ టొబాగో(టీ అండ్​ టీ) క్రికెట్ బోర్డ్ ప్రీమియర్‌షిప్ డివిజన్ I మ్యాచ్‌లో నరైన్‌ కళ్లు చెదిరే ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్ Iకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. పోర్ట్​ ఆఫ్ స్పెయిన్​ వేదికగా క్లార్క్​ రోడ్​ యునైటెడ్​తో జరిగిన మ్యాచ్​లో కనీసం ఒక్క పరుగు కూడా సమర్పించుకోకుండా ఏకంగా 7 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 7 మెయిడెన్లతో 7 వికెట్లు తీయడం విశేషం. నరైన్ సంచలన ప్రదర్శనతో ప్రత్యర్ధి జట్టు 24ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలిపోయింది. అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఇకపోతే సునీల్​ నరైన్​.. మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో.. 31 వికెట్లు తీశాడు. అందులో నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం.

ఇక కోల్​కలా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. ఆ జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ టీమ్​ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఈ సీజన్​కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కెప్టెన్​గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్​కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వినిపించాయి. అయితే అతడితో పాటు మరో బంగ్లాదేశ్​ ఆటగాడు లిటన్ దాస్ కూడా ఈ సీజన్ మెగాటోర్నీలోని పలు మ్యాచ్​లకు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. ఎందుకంటే ఈ బంగ్లా ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదట. మరోవైపు కేకేఆర్​ జట్టు బ్యాటర్ రింకూ సింగ్​ను కెప్టెన్​గా నియమిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ.. కేకేఆర్ టీమ్​కు కెప్టెన్​గా ఎవరిని నియమించబోతున్నారనేది ప్రస్తుతం క్రికెట్​ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి: కెప్టెన్​గా రోహిత్​ చెత్త రికార్డ్​.. ఆ విషయంలో కోహ్లీనే బెస్ట్​!

Last Updated : Mar 20, 2023, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.