ETV Bharat / sports

ICC ODI Rankings: మరోసారి అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ

author img

By

Published : Sep 14, 2021, 5:25 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ మండలి మంగళవారం విడుదల చేసిన మహిళల వన్డే క్రికెట్​ ర్యాంకింగ్స్​లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. వన్డేల్లో కెప్టెన్​ మిథాలీ రాజ్​(Mithali Raj Ranking), టీ20ల్లో షెఫాలీ వర్మ(Shafali Verma Ranking) అగ్రస్థానంలో నిలిచారు.

ICC ODI Rankings: Mithali Raj retains top spot in batting list
ICC ODI Rankings: మరోసారి అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో(ICC ODI Rankings) టీమ్​ఇండియా కెప్టన్​ మిథాలీ రాజ్​(Mithali Raj Ranking) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి తొలి ర్యాంకును దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్లి లీ తో కలిసి పంచుకుంది. వీరిద్దరూ 762 పాయంట్లతో బ్యాటింగ్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అలీసా హేలీ మూడో స్థానంలో ఉండగా.. భారత స్టార్​ బ్యాట్స్​వుమన్​ స్మృతి మంధాన(Smriti Mandhana ODI Ranking) 9వ ర్యాంకులో కొనసాగుతుంది. బ్యాటింగ్​ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్లి లీ.. తొలి ర్యాంకుకు చేరుకోవడం ఇది మూడోసారి.

బౌలింగ్​ ర్యాంకుల్లో​ భారత వెటరన్​ పేసర్​ జూలన్​ గోస్వామి(Jhulan Goswami ICC Ranking), సీనియర్​ స్పిన్నర్​ పూనమ్​ యాదవ్​ వరుసగా ఐదో, 9వ ర్యాంకుల్లో నిలిచారు. అదే విధంగా ఆల్​రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ 5వ ర్యాంకులో కొనసాగుతుంది.

టీ20 ర్యాంకింగ్స్​లో..

మహిళల టీ20 ర్యాంకుల్లో భారత బ్యాట్స్​వుమన్​ షెఫాలీ వర్మ(Shafali Verma Ranking) 759 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాతుండగా.. మూడో ర్యాంకులో స్టార్​ క్రికెటర్​ స్మృతి మంధాన(Smriti Mandhana Ranking) 716 పాయింట్లతో నిలిచింది.

మరోవైపు బౌలింగ్​ ర్యాంకుల్లో మార్పేది జరగలేదు. దీప్తీ శర్మ(Deepti Sharma) 6వ స్థానంలోనే కొనసాగుతుండగా.. పూనమ్​ యాదవ్​(Poonam Yadav) కోల్పోయి 8వ ర్యాంకుకు పరిమితమైంది.

ఇదీ చూడండి.. ప్రపంచకప్​కు ముందే పాక్​ సీనియర్​ క్రికెటర్​ రిటైర్మెంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.