ETV Bharat / sitara

National film awards 2021: అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

author img

By

Published : Oct 25, 2021, 11:55 AM IST

Updated : Oct 25, 2021, 1:29 PM IST

దిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో(national film awards 2021) మహర్షి, జెర్సీ సినిమాలకు తలో రెండు అవార్డులు అందజేశారు. ఈ ఈవెంట్​కు ముఖ్యఅతిథిగా వెంకయ్యనాయుడు(venkaiah naidu family) విచ్చేశారు.

67th National Film Awards
'మహర్షి', 'జెర్సీ' సినిమాలు

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం(national film awards 2021 winners list) సోమవారం అట్టహాసంగా జరిగింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(venkaiah naidu party) చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు.

.
.

బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి 'మరక్కర్‌' నిలవగా, 'భోంస్లే' చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ, 'అసురన్' చిత్రానికి ధనుశ్ ఉత్తమ నటులుగా అవార్డులను సొంతం చేసుకున్నారు. 'మణికర్ణిక' చిత్రానికి కంగనా రనౌత్‌ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు, తెలుగులో 'జెర్సీ', 'మహర్షి' చిత్రాలకు(maharshi movie) నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి.

విజేతలు వీరే..

> ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)

> ఉత్తమ నటుడు: మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)

.
.

> ఉత్తమ నటి : కంగనా రనౌత్‌ (మణికర్ణిక)

> ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)

> ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ

nani jersey movie
జెర్సీ మూవీలో నాని

> ఉత్తమ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి (జెర్సీ)

> ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి

> ఉత్తమ హిందీ చిత్రం: చిచ్చోరే

> ఉత్తమ తమిళ చిత్రం: అసురన్‌

> ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

> ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

.
.

> ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

> ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)

> ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

> ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)

> ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)

> ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ...’)

> ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)

> ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)

ఇది చదవండి: జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీరే

Last Updated : Oct 25, 2021, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.