ETV Bharat / sitara

ధనుష్​ టాలీవుడ్​ ఎంట్రీ.. అదిరిపోయే టైటిల్​తో..

author img

By

Published : Dec 23, 2021, 10:55 AM IST

జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా టైటిల్​ను ప్రకటించింది చిత్రబృందం. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'సార్'​ అనే టైటిల్​ను ఖరారు చేశారు.

dhanush
ధనుష్

భారత్​లోనే వర్సెటైల్​ నటుల జాబితాలో ముందుంటారు సూపర్​స్టార్​ ధనుష్. తమిళంలో విపరీతమైన క్రేజ్​ ఉన్న ధనుష్​కు తెలుగు సహా ఇతర భాషల్లోనూ అభిమానులున్నారు. '3', 'రఘువరన్ బీటెక్' వంటి చిత్రాలతో ఇదివరకే తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఆయన.. ఇప్పుడు నేరుగా తెలుగు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. 'తొలి ప్రేమ' , 'రంగ్​దే' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు ధనుష్. గురువారం ఈ సినిమా మోషన్ పోస్టర్​ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'సార్'​ అనే టైటిల్​ను ఖరారు చేసింది చిత్రబృందం.

dhanush
'సార్​'గా ధనుష్

తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్​ పట్టాలెక్కనుంది. తమిళంలో 'వాతి' అనే టైటిల్​తో రానున్న ఈ సినిమాలో ధనుష్​కు జోడీగా సంయుక్త మేనన్​ నటిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ-సాయి సౌజన్య నిర్మాతలు.

ఇదీ చూడండి: ఈ ఏడాది ఓటీటీలో సూపర్​హిట్​ చిత్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.