ETV Bharat / sitara

ఈ ఏడాది ఓటీటీలో సూపర్​హిట్​ చిత్రాలివే!

author img

By

Published : Dec 23, 2021, 9:01 AM IST

OTT Tollywood Hit movies 2021: కరోనా, లాక్​డౌన్​ సహా ఇతర కారణాల వల్ల ఈ ఏడాది కూడా పలు చిత్రాలు ఓటీటీలోనే రిలీజ్​ అయ్యాయి. అందులో కొన్ని చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవి ఏ చిత్రాలు? ఏ ప్లాట్​ఫామ్​లో అందుబాటులో ఉన్నాయో చూద్దాం..

ఈ ఏడాది ఓటీటీలో సూపర్​హిట్​ చిత్రాలివే!, OTT Tollywood Hit movies 2021
ఈ ఏడాది ఓటీటీలో సూపర్​హిట్​ చిత్రాలివే!

OTT Tollywood Hit movies 2021: కరోనా రాకముందు వరకూ సినిమా అంటే అందరి కళ్లు థియేటర్ల వైపే. కానీ ఈ వైరస్​ వల్ల థియేటర్లకు ఓటీటీ ప్లాట్​ఫామ్​లు ప్రత్యామ్నాయాలుగా కనిపించాయి. ప్రస్తుతం ఇవి సొంతింటి వెండితెరలా మారిపోయాయి. దీంతో వెండితెరపై వినోదాన్ని పంచాల్సిన పలు సినిమాలు నెట్​ఫ్లిక్స్​, ఆహా, అమెజాన్​ ప్రైమ్​ సహా పలు డిజిటల్​ వేదికల ద్వారా వినోదాన్ని అందిస్తున్నాయి. కొన్ని మూవీస్​ తొలుత థియేటర్లో విడుదలై ఆ తర్వాత డిజిటల్​ వేదికపై సందడి చేశాయి. అలా ఈ ఏడాది ఓటీటీలో సూపర్​హిట్​గా నిలిచిన చిత్రాలేంటో చూసేద్దాం..

Drishyam 2 OTT platform: కమర్షియల్‌ అంశాల జోలికి పోకుండా కథకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నారు హీరో వెంకటేశ్​. పైగా రీమేక్‌ కథలను రక్తికట్టించడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇటీవలే అమెజాన్​ వేదికగా ఆయన నటించిన థ్రిల్లర్‌ మూవీ 'దృశ్యం 2' విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో వెంకీ, మీనా, కృతిక, ఏస్తర్‌ అనిల్‌, సంపత్‌ రాజ్‌, నదియా, నరేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్‌, షఫీ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Narappa movie OTT platform: వెంకటేశ్​ నటించిన మరో రీమేక్​ సినిమా 'నారప్ప'. తమిళ చిత్రానికి రీమేక్‌ అయినప్పటికీ వెంకీ నటనతో కట్టిపడేశారు. 'నారప్ప'గా వయసుమీరిన పాత్రలో విశ్వరూపం చూపించారనే చెప్పాలి. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఓటీటీలో విడుదలై విజయం సాధించింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. ప్రియమణి కథానాయిక. అమెజాన్‌ ప్రైమ్‌లో ఉందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

JaiBheem movie OTT platform: ఈ ఏడాది ఓటీటీ వేదికల్లో అనువాద చిత్రాల జోరు బాగానే కనిపించింది. వాటిలో అందరి దృష్టినీ ఆకర్షించినవి తమిళ సినిమాలు 'సార్పట్ట', 'జైభీమ్‌'. ఈ రెండూ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లోనే విడుదలయ్యాయి. సూర్య నటించిన 'జైభీమ్‌' సినిమా దేశవ్యాప్తంగా ఓ సంచలనాన్నే సృష్టించింది. పోలీసుల వల్ల అన్యాయానికి గురైన ఓ ఆదివాసీ కుటుంబం కోసం.. చంద్రు అనే ఓ న్యాయవాది చేసిన స్ఫూర్తిదాయక పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. 1995లో తమిళనాడులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించారు. మనసుల్ని కదిలించే ఇందులోని కథ కథనాలు.. ఆ కథనానికి ప్రాణం పోస్తూ న్యాయవాది చంద్రు పాత్రలో సూర్య ఒదిగిన తీరు.. బాధిత ఆదివాసీలుగా రాజన్న, సినతల్లి పాత్రల్లో మణికందన్‌, లిజోమోల్‌ జోసేలు జీవించిన విధానం సినీప్రియులను ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Sarpatta movie OTT platform: ఇక ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్‌ తెరకెక్కించిన క్రీడా నేపథ్య చిత్రం 'సార్పట్ట'. ఎమర్జెన్సీ రోజుల్లో చెన్నై నేపథ్యంగా సాగే కథతో రూపొందించారు. బాక్సింగ్‌ ఆట చుట్టూ అల్లుకున్న కథకు సామాజిక సమస్యల్ని మేళవిస్తూ రంజిత్‌ రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కమర్షియల్‌, రొమాంటిక్‌ లవ్‌స్టోరీలతో ఆకట్టుకున్న హీరో నితిన్‌. ఈ సారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిందీ సూపర్‌ హిట్‌ 'అంధాధున్​'కు ఇది రీమేక్‌. నభా నటేష్‌ హీరోయిన్‌. తమన్నా లేడీ విలన్‌గా నటించారు. ఓ హత్య చుట్టూ జరిగే ఈ సినిమా కథలోని మలుపులు వీక్షకులకు ఊపిరాడనివ్వవు. డిస్నీ హాట్‌ స్టార్‌లో అందుబాటులో ఉందీ చిత్రం.

ఈ చిత్రాలో పాటు 'సినిమా బండి', 'అరణ్య', 'ప్లే బ్యాక్'​, 'అద్భుతం', 'ఏక్​మినీ కథ', 'ఫ్యామిలీ డ్రామా', 'బట్టల రామస్వామి బయోపిక్​' కూడా ఓటీటీలో బాగా ఆడాయి.

ఫస్ట్​ థియేటర్లలో ఆ తర్వాత ఓటీటీలో

Lovestory movie OTT platorm: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన సినిమా 'లవ్​స్టోరీ'. శేఖర్​కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లను ప్రేక్షకులను తీసుకొచ్చేలా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో అందుబాటులో ఉంది. ఓటీటీలోనూ హవా చూపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Republic movie OTT platorm: ప్రజాస్వామ్య దేశంలో నిజాయతీగా పనిచేసే అభిరామ్ అనే ఓ ఐఏఎస్ అధికారి కథతో ప్రముఖ దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం 'రిపబ్లిక్'. సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్ లోనే కాకుండా ఓటీటీలోనూ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.

RajaRaja chora movie OTT platorm: సినిమా ఏదైనా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా జాగ్రత్తపడతారు శ్రీవిష్ణు. అలా ఈ ఏడాది థియేటర్లలో విజయం సాధించిన ఆయన చిత్రం 'రాజ రాజ చోర'. మేఘా ఆకాశ్‌, సునైన హీరోయిన్లుగా చేశారు. కథనంతోనే ఆకట్టుకునే ఈ సినిమాలో వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. ఆ తర్వాత ఓటీటీలోనూ రిలీజ్​ అయి సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

TuckJagadish movie OTT platorm: నాని గతేడాది 'వి' అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ను అమెజాన్‌ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా విడుదల చేశారు. 'టక్‌ జగదీశ్‌'ను థియేటర్లలో అందించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఓటీటీ బాట పట్టిందీ చిత్రం. స్టైలిష్‌ లుక్‌తో నాని అదరగొట్టారు. మిశ్రమ స్పందన లభించినప్పటికీ కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉందీ మూవీ.

Jatiratnalu movie movie OTT platorm: కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో 'జాతిరత్నాలు' విజయవంతమైంది. కొవిడ్‌ విలయ తాండవానికి విలవిల్లాడిన జనాలకు కామెడీ టానిక్‌లా పనిచేసిందీ చిత్రం. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామక్రిష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది.

Allarinaresh Nandi movie: హాస్య చిత్రాలను చేస్తూ వచ్చిన అల్లరి నరేశ్‌ రూటు మార్చి తీసిన సీరియస్‌ క్రైమ్‌ డ్రామా 'నాంది'. నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీగా నరేశ్‌ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇది ఆహాలో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'పుష్ప' క్రెడిట్ మొత్తం ఆయనదే: అల్లు అర్జున్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.