ETV Bharat / science-and-technology

13 యాప్స్​పై గూగుల్ బ్యాన్​- మీ మొబైల్​లో ఉంటే వెంటనే డిలీట్​ చేయండి!​

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 2:00 PM IST

Google Banned Apps : వినియోగదారుల భద్రత దృష్టిలో పెట్టుకుని టెగ్​ దిగ్గజం గూగుల్ 13 అండ్రాయిడ్​ యాప్స్​పై నిషేధం విధించింది. ఇటీవల మెక్​అఫీ మొబైల్​ రిసెర్చ్​ టీమ్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలోని యాప్స్ మీ మొబైల్​లో ఉంటే వెంటనే డిలీట్​ చేయండి.

Google Banned Apps
Google Banned Apps

Google Banned Apps : యూజర్ల ఫోన్​లకు హాని కలిగించే 13 ఆండ్రాయిడ్ యాప్స్​ను టెక్​ దిగ్గజం గూగుల్​ బ్యాన్​ చేసింది. వాటిని ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. 25 యాప్​ల్లో Xamalicious మాల్వేర్​ ఉన్నట్లు ఇటీవల మెక్​అఫీ మొబైల్​ రిసెర్చ్​ టీమ్ గుర్తించింది. అందులో కొన్ని యాప్స్​ గూగుల్​ ప్లేస్టోర్​లో ఉన్నట్లు కనుగొంది. ఈ డేటా ఆధారంగా వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ​తాజా నిర్ణయం తీసుకుంది గూగుల్.

Xamalicious అంటే Xamarin అనే ఓపెన్​ సోర్స్​ ప్లాట్​ఫామ్​పై రూపొందిన మాల్వేర్ అని మెక్​అఫీ మొబైల్​ రిసెర్చ్​ టీమ్ తెలిపింది. ఈ Xamalicious చేసే మోసాల గురించి వివరించింది. 'Xamalicious బారిన పడిన యాప్​లు సోషల్​ ఇంజినీరింగ్ వ్యూహాల ద్వారా యూజర్ల ఖాతాల యాక్సెస్​ను పొందుతాయి. ఫలితంగా మొబైల్​ యూజర్​కు తెలియకుండా కమాండ్-అండ్-కంట్రోల్ సర్వర్‌తో కమ్యూనికేషన్​ ఏర్పడుతుంది. ఆ తర్వాత సర్వర్​, మొబైల్​లో రెండో పేలోడ్​ (మాల్వేర్)ను ఇన్​స్టాల్​ చేస్తుంది. అనంతరం యూజర్​ మొబైల్​ సర్వర్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది. అప్పటి నుంచి యాజర్​కు తెలియకుండా యాడ్​లపై క్లిక్​ చేయడం, ఇతర యాప్​లను ఇన్​స్టాల్​ చేయడం వంటి మోసపూరిత చర్యలకు ఆ మాల్వేర్ పాల్పడుతుంది' అని రిసెర్చ్​ టీమ్ పేర్కొంది.

అయితే ఇప్పటికే ఈ యాప్స్‌ని లక్షలాది మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. ఒకవేళ మీరు కూడా వాటిని డౌన్​లోడ్​ చేసినట్లైతే గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి తొలగించినా ఇంకా అవి మీ మొబైళ్లలో ఉండవచ్చు. అందుకే వీలైనంత త్వరగా మీ మొబై​ళ్ల నుంచి వాటిని డిలీడ్​ చేయండి.

గూగుల్​ బ్యాన్​ చేసిన యాప్స్​ ఇవే :

  • ఎసెన్షియల్ హోరోస్కోప్ ఫర్ ఆండ్రాయిడ్
  • త్రీడీ స్కిన్ ఎడిటర్ ఫర్ పీఈ మైన్​క్రాఫ్ట్
  • లోగో మేకర్ ప్రో
  • ఆటో క్లిక్ రిపీటర్
  • కౌంట్​ ఈజీ క్యాలరీ కాల్​క్యులేటర్
  • సౌండ్ వాల్యూమ్​ ఎక్స్​టెండర్
  • లెటర్​లింక్
  • న్యూమరాలజీ : పర్సనల్ హోరోస్కోప్ & నంబర్ ప్రిడిక్షన్స్
  • స్టెప్ కీపర్ : ఈజీ పెడోమీటర్
  • ట్రాక్ యువర్ స్లీప్
  • సౌండ్ వాల్యూమ్ బూస్టర్
  • ఆస్ట్రోలాజికల్ నావిగేటర్ : డెయిలీ హోరోస్కోప్ & టరోట్
  • యూనివర్సల్ కాల్​క్యులేటర్

అలెర్ట్- ఆ 17యాప్​లు ఫుల్​ డేంజర్​- మీ ఫోన్​లో ఉంటే డిలీట్ చేయండి!
How To Lock Apps On Android Phone : మీ ఫోన్​లోని డేటా భద్రంగా ఉండాలా?.. సింపుల్​గా యాప్స్​ను లాక్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.