ETV Bharat / entertainment

Atlee Wife Telugu Family : పెళ్లి చేసుకుంటే హేళన చేశారు.. దర్శకుడు అట్లీ తెలుగింటి అల్లుడే అని తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 10:38 AM IST

Updated : Sep 24, 2023, 10:47 AM IST

Atlee Wife Telugu Family : జవాన్​తో పాన్​ ఇండియా లెవల్​లో సూపర్ సకెస్స్​ అందుకున్న దర్శకుడు అట్లీ.. తెలుగింటి అల్లుడని తెలుసా? సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ట్రోల్స్​ను ఎదుర్కొన్న దర్శకుడు అట్లీనే అని తెలుసా? ఆ సంగతులు..

Atlee Marriage Trolls : పెళ్లి చేసుకుంటే హేళన చేశారు.. దర్శకుడు అట్లీ తెలుగింటి అల్లుడే అని తెలుసా?
Atlee Marriage Trolls : పెళ్లి చేసుకుంటే హేళన చేశారు.. దర్శకుడు అట్లీ తెలుగింటి అల్లుడే అని తెలుసా?

Atlee Wife Telugu Family : 'జవాన్'​తో బాద్​ షా షారుక్​ ఖాన్​కు భారీ బ్లాక్ బాస్టర్​ హిట్​ అందించిన దర్శకుడు అట్లీపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన్ను ప్రశంసించే వారు ఎంత మందైతే ఉన్నారో.. అదే స్థాయిలో హేళన చేసిన వారు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ట్రోల్స్​ను ఎదుర్కొన్న దర్శకుడు అట్లీయే! అవును మీరు చదివింది నిజమే..

తెలుగింటి అల్లుడే... దర్శకుడు అట్లీ తన మొదటి చిత్రం రాజారాణితోనే సూపర్ హిట్​ అందుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే 2014లో తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు కృష్ణప్రియ. ఈమెది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. అక్కడే విజయ్‌ టీవీ సీరియల్స్‌లో హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది.

Atlee Wife Krishna Priya : అట్లీతో పాటే ఆమె కూడా సినిమాల్లో ఛాన్స్​ల కోసం ట్రై చేసేది. అప్పుడు వీరి పరిచయం మొదలైంది. అలా స్నేహితులయ్యారు. ఐదేళ్ళ తర్వాత ఓ రోజు తనకు ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని అట్లీతో చెప్పింది. అప్పుడు అట్లీ.. క్యాజువల్‌గా ఆమెకు తన జాతకం ఇస్తానని చెప్పారు. అదేదో జోక్‌లా చుట్టూ ఉన్నవారు నవ్వారు. ఇక ఇంటికి వెళ్లాక.. కృష్ణప్రియ 'ఎందుకలా అన్నావ్‌?' అంటూ ఫోన్‌ చేసి అట్లీని అడిగింది. దానికి అట్లీ.. 'నా మనసులో ఉన్న మాటే చెప్పాను' అని అన్నారు. ఓ నిమిషం తర్వాత వాళ్ళింట్లో ఈ విషయం గురించి మాట్లాడతానని చెప్పి.. ఫోన్ పెట్టేసింది కృష్ణప్రియ. అంతే ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి నిశ్చయమైనట్లు అట్లీ ఓ సందర్భంలో చెప్పారు.

ఆ సమయంలోనే విజయ్‌తో తెరీ (తెలుగులో పోలీసోడు) సినిమా ఖరారైంది. దీంతో విజయ్‌ దళపతి హేటర్స్​.. దర్శకుడు అట్లీని ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. అట్లీ పెళ్ళి ఫొటోలు బయటకు రావడం ఆలస్యం.. 'కాకి ముక్కుకి దొండపండు', కులాంతర వివాహం అంటూ ఎగతాళి చేసేవారు. ట్విట్టర్‌లో ప్రత్యేకంగా ట్యాగ్‌లు ఏర్పాటు చేసి మరీ ట్రోల్​ చేసేవారు. 'తెరి' కలెక్షన్‌ల వర్షం కురిపించింది. ఆ తర్వాత విజయ్‌తోనే వరసగా మెర్సల్‌(అదిరింది), బిగిల్‌(విజిల్‌) కూడా సూపర్ హిట్​గా నిలిచాయి. అయినా ఈ వెక్కిరింపులు ఆగలేదు. ప్రస్తుతం 'జవాన్‌' చిత్రం హిట్​ అయినా కొంతమంది అట్లీని ట్రోల్​ చేస్తూనే ఉన్నారు.

Atlee Trolls Reaction : పోరాడటం మాత్రమే తెలుసు.. తాను ఎదుర్కొంటున్న ట్రోల్స్‌ను ఒక్క నవ్వుతో కొట్టిపారేస్తానని చెబుతుంటారు దర్శకుడు అట్లీ. "నాలాంటి సామాన్యుడు- అదీ నల్లటివాడు ఉన్నత స్థానానికి ఎదిగితే ఇలాంటివి రావడం సాధారణమే. అవి పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను. విజయాల కోసం పోరాడటం మాత్రమే నాకు తెలుసు" అని అట్లీ అంటుంటారు.

Atlee Rajinikanth : రజనీ డూప్​గా రోబోలా కనిపించింది అట్లీనా?.. ఆయన కెరీర్​ ఎలా మొదలైందంటే?

Jawan Oscar : షారుక్ 'జవాన్'​కు ఆస్కార్​ రేంజ్ సత్తా ఉందా?

Jawan Shahrukh : 'జవాన్' విషయంలో నయన్​ అప్సెట్​.. ఇక హిందీ చిత్రాలు బంద్​!.. అసలేం జరిగిందంటే?

Last Updated : Sep 24, 2023, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.