ETV Bharat / crime

జీజీహెచ్​లో బాలుడి కిడ్నాప్​.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

author img

By

Published : Oct 21, 2022, 2:29 PM IST

BOY KIDNAP IN GGH
BOY KIDNAP IN GGH

BOY KIDNAP IN GUNUTR : గుంటూరు GGHలో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. కాన్పు కోసం వచ్చిన తల్లి వెంట వచ్చిన ఆ బాలుడు రాత్రి సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జీజీహెచ్​లో బాలుడి కిడ్నాప్​.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

BOY KIDNAP IN GGH: గుంటూరు జీజీహెచ్​లో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురి కావటం కలకలం రేపింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలేనికి చెందిన కిజియా అనే మహిళ కాన్పు కోసం నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. కిజియాతో పాటు ఆమె ఐదేళ్ల కుమారుడు వర్షిద్ హస్పిటల్​కు వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి వరండాలో నిద్రించాడు. కాసేపటికి వర్షిద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ మహిళ వర్షిద్​ను తీసుకెళ్లినట్లుగా రికార్డు అయ్యింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా జీజీహెచ్​లో పిల్లల అపహరణకు సంబంధించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తరచుగా పిల్లల కిడ్నాప్​లు జరుగుతున్నా.. నిఘా కొరవడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.