ETV Bharat / city

విశాఖ మన్యంలో.. మావోయిస్టుల పేరిట లేఖ

author img

By

Published : May 17, 2019, 1:43 PM IST

Updated : May 17, 2019, 6:50 PM IST

'విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖ'

మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖ లభ్యమైంది. గిరిజనులను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని... రైతులను మావోయిస్టు సానుభూతిపరుల పేరిట నిర్బంధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇంకా పలు అంశాల గురించి వివరించారు.

'విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖ'

విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖ కలకలం రేపుతోంది. మన్యంలో పోలీసుల జులుంతో గిరిజనులు సతమతమవుతున్నారని తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం లేఖలో పేర్కొన్నారు. అటవీ శాఖ అనుబంధంగా పని చేస్తున్న ఏపీఎఫ్​డీసీ ఆధ్వర్యంలోని కాఫీ తోటలపై హక్కు కల్పించాలంటూ గిరిపుత్రులు పోరాటం చేస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు. గిరిజనులను పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మే 1న పనసనొద్ది, కొత్త వెదురుపల్లి గ్రామాల్లో దాడులు చేసి రైతులను అక్రమంగా నిర్బంధిచారని...వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు చేయటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి-ఏపీ ఎడ్​సెట్​- 2019 ఫలితాలు విడుదల

New Delhi, May 17 (ANI): In the light of BJP Bhopal candidate Pragya Singh Thakur's comments on Mahatma Gandhi's assassin Nathuram Godse on Thursday, Communist Party of India (CPI) National Secretary D Raja said, "I strongly condemn the statement made by Pragya Thakur and she should understand the history of the country. Assassination of Mahatma Gandhi was a big tragedy at that point of time. He was shot dead by a fanatic. Pragya Thakur comes out and says that he was a 'deshbhakt,' what about Gandhi ji, was he not a patriot? She should know the history of the country. She thinks she can easily get communal passion glorifying Godse as a patriot."
Last Updated :May 17, 2019, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.