ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు@7PM

author img

By

Published : Dec 12, 2021, 6:57 PM IST

7pm_Topnews
7pm_Topnews

.

  • ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి.. వైకాపా హానికరం : పవన్ కల్యాణ్
    "ఇది వ్యక్తుల సమస్య కాదు.. రాష్ట్ర సమస్య. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం ముందు నిలవాలి." అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఆదివారం ఉదయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన పవన్.. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించి ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భరతమాత ముద్దుబిడ్డకు వీడ్కోలు.. అశ్రునయనాల నడుమ సాయితేజ అంత్యక్రియలు
    Jawan-sai-teja: హెలికాప్టర్​ ప్రమాదంలో మృతిచెందిన జవాన్​ సాయి తేజ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన సొంత ఊరు ఎగువ రేగడ గ్రామంలో అంతిమ వీడ్కోలు పలికారు. గాల్లోకి కాల్పులు జరిపి.. సైన్యం గౌరవ వందనం సమర్పించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • srisailam temple: శ్రీశైలంలో ఆర్జిత సేవలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి: ఈవో
    శ్రీశైలంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని ఆలయ ఈవో లవన్న తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లకు ఆధార్ ఖచ్చితమని వెల్లడించారు. టికెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతోనే.. ఆధార్ నిబంధన తెచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విద్యుత్ నిలిపివేతపై.. ఎస్సీ కమిషన్​కు వర్ల రామయ్య లేఖ
    varla complaint: అంగలూరు ఎస్సీ కాలనీలో.. మూడు రోజులుగా విద్యుత్ నిలిపివేయడంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జాతీయ ఎస్సీ కమిషన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కరెంటు కోతతో తాగునీరు సైతం అందక ఆ గ్రామంలోని దళితులు అంధకారంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కాంక్రీట్ మిక్సర్​తో పిండి కలిపి వంటలు.. 2లక్షల మందికి అన్నదానం!
    లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడం వల్ల ఆహారం త్వరగా తయారు చేసేందుకు కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని ఉపయోగించారు. మల్పువా(ఓ రకం మిఠాయి) పిండిని కాంక్రీట్ మిక్సర్ యంత్రం​లో వేసి కలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. 15 ట్రాలీల సాయంతో భోజనం సరఫరా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మారడోనా వాచ్ మాత్రమే కాదు.. చాలా వస్తువులు కొట్టుకొచ్చాడు!'
    Maradona watch thief: ఫుట్​బాల్ దిగ్గజం మారడోనా వాచ్ చోరీ కేసులో నిందితుడు వాజిద్ హుస్సేన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. టోపీ, షూస్​, ఐపాడ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వస్తువుల్లో ఏవి మారడోనాకు చెందినవో తెలియాల్సి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రైతులకు ఏడాది ఫ్రీగా భోజనం పెట్టిన లంగర్​.. ఇకపై రెస్టారెంట్​!
    Golden Hut Restaurant: దిల్లీ సింఘు సరిహద్దుల్లో రైతుల నిష్క్రమణతో.. అక్కడి ప్రముఖ గోల్డెన్​ హట్​ రెస్టారెంట్​ తిరిగి తెరుచుకొనేందుకు సిద్ధమైంది. రైతు ఆందోళనల కారణంగా ఈ రెస్టారెంట్​ మూతబడినప్పటికీ వారికి సొంత ఖర్చుతో అక్కడ ఏడాదిపాటు భోజనం ఏర్పాటు చేశారు యజమాని రాణా రాంపాల్​. మరోవైపు.. గాజీపుర్​ సరిహద్దుల్లో రైతులు లక్షలు వెచ్చించి నిర్మించుకున్న హౌస్​ ఆన్​ వీల్స్​ను తమ జ్ఞాపకంగా మలుచుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పేదల లబ్ధి కోసమే బ్యాంకింగ్​ వ్యవస్థలో సంస్కరణలు'
    PM Modi on Deposit Insurance: ప్రభుత్వం చేపట్టిన డిపాజిట్ ఇన్సూరెన్స్ సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారులకు విశ్వాసాన్ని కలిగిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలకు లబ్ధి చేకూర్చేలా గత ఏడేళ్లలో ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Gambhir on Kohli: 'కెప్టెన్ కాకపోయినా కోహ్లీ ప్రమాదకరమే'
    Gambhir on Kohli: టీమ్​ఇండియా వన్డే జట్టు సారథిగా విరాట్​ కోహ్లీని ఇటీవలే తప్పించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో విరాట్​ కోహ్లీపై పలు వ్యాఖ్యలు చేశాడు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్. కోహ్లీపై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండబోదని, అతడిలో మరోసారి గొప్ప ఆటగాడిని చూస్తామని అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ కూడా బీసీసీఐ నిర్ణయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాజేంద్రప్రసాద్ ఓటీటీ ఎంట్రీ.. మీనాక్షి కోసం విజయ్ సేతుపతి
    Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాజేంద్రప్రసాద్ తొలి ఓటీటీ సినిమా, హనుమాన్, శ్యామ్​సింగరాయ్, గాలివాన, విక్రమ్ రాథోడ్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.