ETV Bharat / sports

Gambhir on Kohli: 'కెప్టెన్ కాకపోయినా కోహ్లీ ప్రమాదకరమే'

author img

By

Published : Dec 12, 2021, 5:33 PM IST

Gambhir on Kohli: టీమ్​ఇండియా వన్డే జట్టు సారథిగా విరాట్​ కోహ్లీని ఇటీవలే తప్పించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో విరాట్​ కోహ్లీపై పలు వ్యాఖ్యలు చేశాడు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్. కోహ్లీపై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండబోదని, అతడిలో మరోసారి గొప్ప ఆటగాడిని చూస్తామని అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ కూడా బీసీసీఐ నిర్ణయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

gambhir, virat
గంభీర్, విరాట్

Gambhir on Kohli: టీమ్​ఇండియా వన్డే జట్టు సారథిగా విరాట్ కోహ్లీని తొలగిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. బీసీసీఐ నిర్ణయంతో విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

"సుదీర్ఘ ఫార్మాట్​లో రోహిత్ శర్మపై ఎలాంటి భారం లేదు. అదే తరహాలే ఇప్పుడు కోహ్లీపై వన్డే, టీ20 కెప్టెన్సీ భారం ఉండదు. ఈ నేపథ్యంలో విరాట్ మరింత నైపుణ్యంతో ఆడే అవకాశముంది. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కచ్చితంగా మెరుగైన బ్యాటింగ్​ ఫామ్​ను కనబరుస్తాడని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఇద్దరు మెరుగైన సారథులు భారత జట్టుతో తమ ఆలోచనలు పంచుకుంటున్నారు."

--గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్.

కెప్టెన్సీ పోయినంత మాత్రాన విరాట్​ కోహ్లీ ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదని గంభీర్ పేర్కొన్నాడు. కోహ్లీలో మరోసారి గొప్ప ఆటగాడిని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కోహ్లీ కెప్టెన్సీ కోల్పోవడం మంచిదే..

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం కూడా ఒక విధంగా మంచిదేనని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ అన్నాడు. దీంతో అతడు బ్యాటర్‌గా రాణించే అవకాశం ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులకు, పరిమిత ఓవర్ల క్రికెట్​కు వేర్వేరు కెప్టెన్లు ఉండటం వల్ల ఆయా సారథులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. హాగ్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం అనేది మంచి పరిణామమే అని నేను భావిస్తున్నా. అతడిప్పుడు ప్రశాంతంగా ఉంటూ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని టెస్టు కెప్టెన్సీపై దృష్టిసారించాలి. ఇప్పుడు టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ బాధ్యతల్ని రోహిత్‌ శర్మ చూసుకుంటాడు. అతడికి నచ్చినట్లు జట్టును ముందుకు తీసుకెళ్తాడు. కోహ్లీ మాత్రం టెస్టులను చూసుకుంటే సరిపోతుంది. దీంతో అతడిపై ఉన్న ఒత్తిడి చాలా వరకు తొలగిపోతుందని అనుకుంటున్నా. ఒక విధంగా ఇది కోహ్లీకే మంచిదని చెప్పొచ్చు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం వల్ల పెరిగే ఒత్తిడి కారణంగా కోహ్లీ కొంతకాలంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌ బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కచ్చితంగా అతడి ప్రదర్శన మెరుగవుతుంది"

--బ్రాడ్​హాగ్, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్.

కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని అంతకుముందే ఐపీఎల్‌ యూఏఈ లీగ్‌ ప్రారంభంలో ప్రకటించాడు. అయితే, ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసినప్పుడు సెలెక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ నిర్ణయం ప్రకటించడం వల్ల కోహ్లీ అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. మరోవైపు ఈ విషయంపై ఇప్పటివరకు కోహ్లీ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే బ్రాడ్‌ తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నాడు. మరోవైపు జట్టు తీసుకున్న ఈ నిర్ణయంతో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎలాంటి వివాదాలు తలెత్తకూడదని హాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ, రోహిత్‌ మధ్య ఎలాంటి విద్వేషాలు తలెత్తకూడదని అన్నాడు.

ఇదీ చదవండి:

కెప్టెన్​గా కోహ్లీ తొలగింపు.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

IND vs SA Series: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా ప్రయాణం అప్పుడే!

రజనీ స్టైల్లో వెంకటేశ్​ అయ్యర్​.. 'సెంచరీ' సెల్యూట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.