ETV Bharat / city

Language Problem In Govt Schools: ఇంగ్లీష్​తో.. విద్యార్థులు, టీచర్ల మధ్య పెరుగుతున్న అంతరం

author img

By

Published : Dec 30, 2021, 7:39 AM IST

Language problem to teach in English medium in government schools
Language problem to teach in English medium in government schools

Gap between Teachers and students with English medium: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించాలనే నిబంధన వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భాషా సమస్య ఏర్పడుతోంది. ఈ మేరకు జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్​సీఈఆర్​టీ) నివేదించింది. గురువులు చెప్పిన పాఠాలను పిల్లలు అర్థం చేసుకోవడంలోనూ లోపం కనిపిస్తోందని పేర్కొంది.

ఆంగ్ల మాధ్యమం బోధనతో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భాషా సమస్య

Language problem with English medium in AP: 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(NCERT) దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన అధ్యయనాల ఫలితాలతో వార్షిక నివేదిక రూపొందించింది. పరిశోధనలో భాగంగా...ఉపాధ్యాయులు సైన్సు పాఠ్యాంశాల బోధన, విషయ పరిజ్ఞానాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారో పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అధ్యయనం నిర్వహించింది. మూడు జిల్లాల్లో 30 మంది ఉపాధ్యాయులను నమూనాగా ఎంపిక చేసుకుంది. బోధనసమయంలో వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారో దగ్గర నుంచి పరిశీలించింది. ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలున్నా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఏం నేర్పాలి? ఏం నేర్చుకుంటున్నారనే విషయాల్లోతోపాటు అభ్యసన మదింపులోనూ స్పష్టత లోపించిందని(ఎన్​సీఈఆర్​టీ)తెలిపింది. విద్యార్థులు కాన్సెప్ట్‌ నేర్చుకోవాల్సిన అవసరాన్ని బోధన సమయంలో ఉపాధ్యాయులు చెప్పడం లేదని పేర్కొంది.

సమన్వయ లోపం కనిపిస్తోంది..
ఉపాధ్యాయులు ఉపన్యాస ధోరణిలో పాఠాలు చెప్తున్నారని.. కాన్సెప్ట్‌ యాక్టివిటీ అమల్లోకి వచ్చినా వారు సరిగా అర్థం చేసుకోవడం లేదని పేర్కొంది. చాలామంది బోధన పద్ధతులు, కంటెంట్‌ నడుమ సమన్వయ లోపం కనిపిస్తోందనివివరించింది.బోధనకు, ప్రణాళికకు మధ్య అంతరాలు ఉంటున్నాయని తెలిపింది.చాలా మంది ఉపాధ్యాయలు.. తాము చెప్పే పాఠాలను విద్యార్థులు నేర్చుకుంటున్నారని భావించి, తమ కృషిని అంతటితో అపేస్తున్నారని వెల్లడించింది. ఉన్నతాధికారుల నుంచి పరీక్షల ఫలితాల ఒత్తిడి కష్టమైన పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల్లో ఆసక్తి లేకపోవడం, నిర్లక్ష్యం, వనరుల కొరత, తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారని జాతీయ విద్యామండలి తెలిపింది.

పెరిగిన హాజరు శాతం..
NCERT Study on Right to Education Act: విద్యాహక్కు చట్టం ఎలా అమలవుతోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయన్న అంశంపై కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఎన్‌సీఈఆర్టీ అధ్యయనం చేసింది. చట్టం అమలు తర్వాత విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం పెరిగినట్లు పేర్కొంది. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు, వ్యవసాయ పనులకు వలసలు వంటి కారణాల వల్ల కొందరు బడిమానేస్తున్నారని తెలిపింది. మౌలిక వసతులు మెరుగుపడినా నిర్వహణ సరిగా ఉండడం లేదని పేర్కొంది. పాఠ్య పుస్తకాలు, బ్యాగ్‌లు, ఏకరూప దుస్తుల పంపిణీ బాగా జరుగుతోందని, కొన్నిచోట్ల ఆలస్యమవుతోందని వెల్లడించింది. విద్యార్థుల హాజరు పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకం దోహదం చేస్తోందని తెలిపింది.

ఇదీ చదవండి..

Meeting On PRC: నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ.. పీఆర్సీపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.