ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM

author img

By

Published : Jul 25, 2022, 8:58 AM IST

9AM TOPNEWS
ప్రధానవార్తలు @9AM

.

  • పోలవరంలో విధ్వంసానికి అసమర్థతే కారణం..!

‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట ఏర్పడ్డ పెద్ద పెద్ద గ్యాప్‌లు, నదీగర్భం కోతకు ప్రకృతి ప్రకోపం కారణం కాదు. ఇది పూర్తిగా మానవ వైఫల్యమే. సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో పడ్డ గుంతలను పూడ్చకపోవడమే ఇందుకు కారణం. అసమర్థ ప్రణాళికవల్లే ఈ ఉత్పాతం ఏర్పడింది’ అని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందం తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • గుత్తేదారుల మార్పే పోలవరానికి శాపం!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంత ఆలస్యానికి ప్రధాన కారణం గుత్తేదారులను మార్చడమే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్నా.. అందులో 30 శాతమే ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చుల ఆడిట్‌ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోవడంతో కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌లో సమస్యలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • విలీన మండలాల్లో వరద కష్టాలు..

అమ్మా.. ఆకలేస్తోందని బిడ్డ ఏడుస్తున్నా ఓదార్చడం తప్ప కడుపు నింపలేని దీనస్థితిలో తల్లి.. కొండలపై వేసుకున్న గుడారాల్లోకి పాములొచ్చి తమవారిని ఏం చేస్తాయోననే ఆందోళనలో తండ్రి.. ఏళ్లపాటు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు, కొనుక్కున్న సామగ్రి కళ్లెదుటే గోదారి పాలవుతుంటే కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వృద్ధ దంపతులు.. గోదావరి వరద బాధిత కుటుంబాల దీనగాథ ఇది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • గోదావరి వరద తగ్గుముఖం.. ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

గోదావరి నది శాంతించింది. వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 12.5 అడుగులు ఉండగా, సాయంత్రం 6 గంటలకు 11.7 అడుగులకు తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. సముద్రంలోకి 9.7 లక్షలు, కాలువలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • 'కోళ్ల పరిశ్రమకు సుందర నాయుడి సేవలు ఎనలేనివి'

కోళ్ల పరిశ్రమ ఉన్నంత కాలం సుందరనాయుడు.. రైతుల మనసుల్లో జీవించే ఉంటారని.. ప్రముఖులు, రైతులు కొనియాడారు. కోళ్ల పరిశ్రమకు ఆయన అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. కోళ్ల రైతుల ఆధ్వర్యంలో చిత్తూరులో నిర్వహించిన సుందరనాయుడు సంస్మరణ సభలో.. ఆయన కుటుంబసభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆయనకు నివాళులు అర్పించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • మద్యపానానికి బదులు.. గంజాయిని ప్రోత్సహించాలి: భాజపా ఎమ్మెల్యే

మద్యపానానికి బదులు గంజాయిని ప్రోత్సహించాలంటూ ఓ భాజపా ఎమ్మెల్యే ప్రభుత్వానికి సూచించారు. గంజాయి తాగిన వాళ్లు అత్యాచారం, హత్యలకు పాల్పడిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. మరోవైపు, భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ పార్టీ మండిపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • మంకీపాక్స్​ 'బిల్​ గేట్స్​ కుట్ర' అంటూ దుష్ప్రచారం.. ఇదీ అసలు నిజం!

ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న 'మంకీపాక్స్​' వైరస్​.. వ్యాపార దిగ్గజం బిల్​ గేట్స్​ ఆదాయార్జన కోసం చేసిన కుట్ర అంటూ సోషల్​ మీడియాలో సాగుతున్న ప్రచారం అసత్యమని 'ఈటీవీ భారత్​ ఫ్యాక్ట్​ చెక్'​లో తేలింది. 1958లోనే తొలిసారి ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని, అప్పటి నుంచే అనేక దేశాలు మంకీపాక్స్​పై పోరు సాగిస్తున్నాయని అధికారిక పత్రాల పరిశీలన ద్వారా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • 'రాష్ట్రాల కోరిక మేరకే వాటిపై జీఎస్టీ.. నిర్ణయం కేంద్రానిది కాదు'

రాష్ట్రాలు చేసిన అభ్యర్థన ప్రకారమే ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ విధించాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో తీసుకుందని, అందులో అన్ని రాష్ట్రాలు భాగమేనని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • అలా చేస్తేనే టెస్టుకు ఆదరణ పెరుగుతుంది: రవిశాస్త్రి

Ravishastri test cricket: టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ప్రస్తుత విధానం ప్రకారం పదేసి జట్లతో మ్యాచ్‌లను ఆడించకూడదని పేర్కొన్నాడు. కేవలం ఆరు టీమ్‌లతో మాత్రమే టెస్టులు ఆడించాలని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • ఈ ముద్దుగుమ్మలకు ఆఫర్లేమో తక్కువ.. గ్లామర్​ డోస్​ ఎక్కువ!

సోషల్​ మీడియా వినియోగం పెరిగిపోవడంతో మూవీస్టార్స్​ నిత్యం ఫ్యాన్స్​కు టచ్​లో ఉంటున్నారు. తమకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోషూట్​తో పాటు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను షేర్​ చేస్తున్నారు. అయితే ఈ ప్లాట్​ఫామ్​​.. ముఖ్యంగా అవకాశాలు తగ్గిపోతున్న హీరోయిన్లకు ఓ వరంగా మారింది. ఛాన్స్​లు తగ్గడం వల్ల గ్లామర్​ డోస్​ పెంచేస్తున్నారు పలువురు ముద్దుగుమ్మలు​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.