ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : May 20, 2022, 9:01 PM IST

ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు

. ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • "చలో దావోస్".. ఫ్లైట్ ఎక్కిన సీఎం జగన్ బృందం
    దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు.. సీఎం జగన్ బృందం బయల్దేరి వెళ్లింది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకూ ఐదు రోజుల పాటుసాగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి టీమ్ పాల్గొంటుంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నరాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాల్ని వివరించి.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • CBN: వైకాపా పాలనలో పరిశ్రమల్లేవు.. యువతకు ఉద్యోగాల్లేవు: చంద్రబాబు
    సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా మాత్రమేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా పాలనలో పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు లేవని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆశ ప్రజలందరిలోనూ ఉందని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • వైకాపా ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.. ఏం జరిగింది?
    కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ కారులో మృతదేహం ఉండటం కలకలం రేపింది. అది కూడా ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్​గా పని చేస్తున్న వ్యక్తిదే కావడం.. నిన్న ఎమ్మెల్సీనే సదరు డ్రైవర్​ను బయటకు తీసుకెళ్లడంతో.. ఏం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • దారుణం.. రూ.300 ఇవ్వలేదని మహిళను తొక్కించిన లారీ డ్రైవర్..!
    గుంటూరు జిల్లాలో ఓ లారీ డ్రైవర్ అత్యాశ మహిళ మృతికి కారణమైంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని లారీ ఎక్కిన మహిళ... డ్రైవర్ కాఠిన్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. లారీ పట్టుకుని వేలాడుతున్న మహిళను డబ్బుల కోసం అలాగే ఈడ్చుకుపోవటంతో... దుర్మరణం పాలైంది. తల్లి, తండ్రిని కొల్పోయి అనాథలైన పిల్లల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​కు పరాజయమే'.. పీకే జోస్యం​!
    ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడిపోతుందని జోస్యం చెప్పారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​. ఇటీవల నిర్వహించిన చింతన్​ శిబిర్​తో కాంగ్రెస్​కు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'జ్ఞాన్​వాపీ మసీదు కేసు'పై సుప్రీం కీలక ఆదేశాలు
    ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసి జ్ఞాన్​వాపీ మసీదులో పూజలకు అనుమతించాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను.. వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీం కోర్టు. ఉత్తర్​ప్రదేశ్​ న్యాయ విభాగానికి సంబంధించి.. సీనియర్​, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్​ అధికారి ఈ కేసును విచారించాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కశ్మీర్​ భారత్​లో అంతర్భాగం.. పాక్​ వ్యాఖ్యలకు స్ట్రాంగ్​ కౌంటర్​!
    భారత్​తో సంబంధాలపై పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి బిలావల్​ భుట్టో స్పందించారు. ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజనతో ఇరు దేశాల సంబంధాలు మరింత సంక్షిష్టంగా మారాయన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను భారత్​ తీవ్రంగా ఖండించింది. జమ్ముకశ్మీర్ భారత్​లో అంతర్భాగమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మార్కెట్లలో మళ్లీ జోష్​.. సెన్సెక్స్​ 1500, నిఫ్టీ 450 ప్లస్​
    స్టాక్​ మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్​ 1500 పాయింట్లకుపైగా పెరిగి 54 వేల 300 మార్కు ఎగువన ముగిసింది. నిఫ్టీ 450 పాయింట్ల లాభంతో 16 వేల 266 వద్ద స్థిరపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'శేఖర్' రివ్యూ.. పోలీస్​ పాత్రలో రాజశేఖర్​ మరోసారి మెప్పించారా?
    వ‌య‌సు పైబ‌డిన పోలీస్ అధికారి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన చిత్రం 'శేఖర్'. జీవిత దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ చిత్రం 'జోసెఫ్'​కు రీమేక్​గా రూపొందిన 'శేఖర్'.. ప్రేక్షకులను మెప్పించిందో లేదో తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • MS Dhoni IPL 2023: ఐపీఎల్​ 2023లో ఆడటంపై ధోనీ క్లారిటీ
    చెన్నైసూపర్​ కింగ్స్​ అభిమానులకు గుడ్​ న్యూస్ చెప్పాడు సారథి మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్​ 2023లో ఆడనున్నట్లు స్పష్టంచేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.