ETV Bharat / state

ఆ మూడు పార్టీల అభ్యర్థులను నియోజకవర్గం నుంచి బయటకు పంపేసిన పోలీసులు - Politicians Sent to Another Town

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 7:55 PM IST

Updated : May 17, 2024, 9:36 PM IST

Major Parties Candidates Sent to Another Town by Police: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలీసులు ఊరు దాటించారు. వారు గ్రామంలో ఉంటే గొడవలు జరుగుతాయని పంపినట్లు తెలిపారు. పోలింగ్ రోజు ఇరుపార్టీల మధ్య ఘర్షణ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

politicians_sent_to_another_town
politicians_sent_to_another_town (Etv Bharat)

Major Parties Candidates Sent to Another Town by Police: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తతల నేపథ్యంలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలీసులు ఊరు దాటించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిని హైదరాబాద్, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని బనగానపల్లి జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హైదరాబాద్ పంపారు. మూడు రోజులుగా ముగ్గురు అభ్యర్థులను గృహనిర్బంధం చేసిన పోలీసులు గ్రామంలో ఉంటే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో ఊరు దాటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది.


టీడీపీకి ఓటు వేసిన వారిపై వైసీపీ దాడి ఘటనలో -బాధితుల మీడియా సమావేశం - YCP Attack A Family in Visakha

జమ్మలమడుగులో ప్రస్తుతం డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ కార్యాలయాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. జమ్మలమడుగుకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరినైనా కించపరిచేలా పోస్టులు పెట్టినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీనికి గ్రూప్ అడ్మిన్లను బాధ్యుల్ని చేస్తామని స్పష్టం చేశారు.

ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటుకు కసరత్తు పూర్తి- ఈ రాత్రికి ప్రకటన - SIT Inquiry on Election Violence

ప్రస్తుతం జమ్మలమడుగులో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. ప్రస్తుతానికి జమ్మలమడుగులో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు వెంకటేశ్వర కాలనీ 116, 117 పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, కూటమి నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి చేజారకుండా టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచామని డీఎస్పీ తెలిపారు.

జమ్మలమడుగు పట్టణంలో జరిగిన సంఘటనలపై సోషల్ మీడియాలో రేకెత్తించే పోస్టులు పెట్టిన 4 వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకోవడం జరిగిందన్నారు. సోషల్ మీడియా గ్రూపులలో ఇతర పార్టీల వారిని కించ పరిచే విధంగా పోస్టులు పెట్టిన లేదా తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేసిన పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని దీనికి గ్రూప్ అడ్మిన్​లను కూడా బాధ్యులుగా గుర్తించి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

జేసీ కుటుంబానికి పోలీసుల ఆంక్షలు- 'గృహ నిర్బంధం చేస్తాం’ అంటూ హెచ్చరికలు - JC Family Problems Due to Police

Last Updated : May 17, 2024, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.