ETV Bharat / business

మార్కెట్లలో మళ్లీ జోష్​.. సెన్సెక్స్​ 1500, నిఫ్టీ 450 ప్లస్​

author img

By

Published : May 20, 2022, 3:46 PM IST

Stock Market Closing: స్టాక్​ మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్​ 1500 పాయింట్లకుపైగా పెరిగి 54 వేల 300 మార్కు ఎగువన ముగిసింది. నిఫ్టీ 450 పాయింట్ల లాభంతో 16 వేల 266 వద్ద స్థిరపడింది.

stock-market-closing Sensex surges 1534 points
stock-market-closing Sensex surges 1534 points

Stock Market Closing: కిందటి సెషన్​లో భారీ నష్టాలను నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు.. వారాంతపు సెషన్​లో ఘనంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1534 పాయింట్లు పెరిగి.. 54 వేల 326 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 457 పాయింట్ల లాభంతో 16 వేల 266 వద్ద సెషన్​ను ముగించింది.
ఫార్మా, లోహం, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ సూచీలు 3-4 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు 2 శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో అన్నీ లాభాల్లోనే ముగియడం విశేషం. అదానీ పోర్ట్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా మోటార్స్​, టాటా స్టీల్​, ఎల్​ అండ్​ టీ రాణించాయి. అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.5,437 కోట్ల ఆదాయాన్ని, రూ.88 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో ఇవాళ్టి సెషన్​లో ఈ షేరు 7 శాతానికిపైగా (రూ. 302)​ దూసుకెళ్లింది. రిలయన్స్​ 6 శాతానికిపైగా పెరిగింది. శ్రీ సిమెంట్స్​, యూపీఎల్​ మాత్రం స్వల్పంగా నష్టపోయాయి.

గురువారం సెషన్​లో భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిసినా.. యూఎస్‌ ఫ్యూచర్స్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం సానుకూలంగా కదలాడాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌, ఆసియా సూచీల నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లు భారీ లాభాలను నమోదుచేశాయి.

ఇవీ చూడండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు అమ్మిన మెర్సిడెస్​

క్రికెట్ వ్యాపారంలోకి సత్య నాదెళ్ల.. ఐపీఎల్​ వైపు చూస్తారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.