ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM

author img

By

Published : Aug 8, 2022, 8:59 AM IST

9AM AP TOPNEWS
ప్రధానవార్తలు @9AM

..

  • ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కంభం సమీపంలోని వాసవి పాలిటెక్నిక్​ కళాశాల వద్ద అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై... లారీని వెనక నుంచి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో.. ఉత్తర కోస్తా, యానాంలో.... ఇవాళ, రేపు... ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాఠశాలల్లో పెరుగుతున్న గైర్హాజరు..

రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరు శాతం ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి... సగటున 15 శాతం వరకూ విద్యార్థులు... బడులకు హాజరు కావడం లేదు. పిల్లల హాజరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంకెన్నాళ్లకు సొంత కార్యాలయం!

రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన గ్రామ సచివాలయాల భవన నిర్మాణాల పనులు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా తయారయ్యాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. చాలాచోట్ల పంచాయతీ భవనాల్లోనే అరకొర సదుపాయాల మధ్య సచివాలయాలను నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మూడు 'టి'లతో స్వావలంబన.. ప్రపంచనేతగా భారత్!'

వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికతలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించి, ప్రపంచానికి నేతగా భారత్ అవతరించాలని అన్నారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కొవిడ్‌ మహమ్మారి నుంచి మన దేశం బయటపడగలిగిందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐక్యత లేక.. సఖ్యత కానరాక.. పైచేయి కోసం విపక్షాల కుమ్ములాట!

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో విపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు తేటతెల్లమయ్యాయి. పైచేయి కోసమే కాంగ్రెస్‌, తృణమూల్‌ ఆరాటపడటం, బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ కూడా విపక్షాలకు పెద్ద తలనొప్పిగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కామన్​వెల్త్​ గేమ్స్​లో శ్రీలంక క్రీడాకారులు మిస్సింగ్!

కామన్​వెల్త్​ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది శ్రీలంక ఆటగాళ్లు అనుమానాస్పదరీతిలో అదృశ్యమయ్యారు. బ్రిటన్​లో ఉండిపోయేందుకే వారు ఇలా చేసి ఉంటారని శ్రీలంక అధికారులు భావిస్తున్నారు. అంతకుముందు 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా కూడా ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 28 ఐపీఓలు.. రూ.45వేల కోట్లు.. త్వరలో మరిన్ని..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐపీఓ ద్వారా నిదులు సమకూర్చేందుకు 28 కంపెనీలకు సెబీ అనుమతించింది. ఇందులో 11 సంస్థలు రూ.33వేల కోట్లు సమీకరించాయి. మరికొన్ని సంస్థలు ఐపీఓలకు రావాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కష్టపడటమే నా మంత్రం.. దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటా'

బాక్సింగ్​లో దేశానికి పతకాలు అందిస్తూనే ఉంటానని విశ్వాసం వ్యక్తం చేసింది తెలుగమ్మాయి నిఖత్ జరీన్. కష్టపడినంతకాలం తనను ఎవరూ ఆపలేరని స్పష్టం చేసింది. కామన్​వెల్త్​లో స్వర్ణం గెలిచిన నేపథ్యంలో ఈనాడుతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలు ఇలా... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పిలుస్తున్న బాలీవుడ్.. హిందీ చిత్రసీమలో తెలుగు దర్శకుల హవా!

తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ వెలుగు వెలుగుతోంది. మన కథలు అందరికీ నచ్చుతున్నాయి. ప్రాంతీయ.. భాషా సరిహద్దులు చెరిపేస్తూ ప్రతి ఒక్కరి మనసుల్ని హత్తుకుంటున్నాయి. పసందైన వినోదాల్ని పంచిస్తున్నాయి. అందుకే మన దర్శకులు తయారు చేస్తున్న కథలపై బాలీవుడ్‌ స్టార్లు, నిర్మాతలు మనసుపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.