ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Oct 12, 2022, 6:59 PM IST

ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM
7PM TOP NEWS

.

  • వైకాపా మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు: చంద్రబాబు
    Chandrababu Comments on YSRCP: ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైకాపాకు వ్యతిరేకంగా పోరాడాలని తెదేపా నేతలను చంద్రబాబు సూచించారు. మరోవైపు విశాఖలో తన ఆస్తులపై విజయసాయిరెడ్డి వివరణపై తెదేపా నేతల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖలో వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన, బొత్సలు భూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Lokesh letter to CM: సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ... ఎందుకోసమంటే..?
    Nara Lokesh letter to CM Jagan: సర్పంచ్​లపై కేసులు ఎత్తివేయాలని సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ రాశారు. ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించిన పంచాయతీ నిధులను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని లేఖలో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Strange baby: శ్రీకాకుళంలో వింత శిశువు జననం.. పరిస్థితి విషమం
    Strange baby in ap: పాపో.. బాబో పుడుతుందని ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. పుట్టిన బిడ్డను చూసి తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. రెండు తలలు ఒకటే దేహంతో పుట్టిన ఆ పాపను చూసి.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భార్యపై అనుమానం.. సుత్తితో కొట్టి చంపిన భర్త.. ఆ తర్వాత
    Husband killed his wife: పల్నాడు జిల్లా నరసరావుపేటలో.. భార్యను సుత్తితో కొట్టి భర్త హత్య చేశాడు. స్థానిక మార్కెట్‌ సెంటర్‌ వద్దనున్న రైల్వే ట్రాక్‌ పై ఈ ఘటన జరిగింది. భార్యపై అనుమానంతోనే భర్త వెంకట్రావు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య పద్మను హత్యచేసిన అనంతరం భర్త వెంకట్రావు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ గ్యాస్​ సంస్థలకు కేంద్రం రూ.22వేల కోట్ల సాయం.. వారికి దీపావళి బోనస్!
    ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మూడు గ్యాస్​ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. 2020 నుంచి 2022 మధ్యలో అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్లు విక్రయించి నష్టాలు మూటగట్టుకున్న ఈ సంస్థలకు రూ.22 వేల కోట్లు గ్రాంటు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ర్యాపిడో, ఓలా, ఉబర్​లపై నిషేధం.. ఆ సర్వీసులు బంద్.. ప్రభుత్వం ఉత్తర్వులు
    కర్ణాటకలో ఓలా, ఉబర్​, ర్యాపిడో సంస్థలు అందిస్తున్న ఆటో రిక్షా సర్వీసులను బుధవారం నుంచి నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఆన్​లైన్ బుకింగ్స్​ను సైతం నిషేధిస్తున్నట్లు పేర్కొంది. రోడ్డు రవాణ సంస్థతో పాటు రోడ్డు భద్రత విభాగంతో మంగళవారం జరిపిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాపం.. ఒకేసారి 477 తిమింగలాలు మృతి
    రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో 200కిపైగా పైలట్‌ తిమింగలాలు మరణించిన ఘటన మరువక ముందే న్యూజిలాండ్‌లో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. న్యూజిలాండ్‌లోని మారుమూల బీచ్‌లలో చిక్కుకుపోయి 477 పైలట్‌ తిమింగలాలు ప్రాణాలు కోల్పోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పడకేసిన పారిశ్రామిక ప్రగతి!
    రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో కాస్త పెరిగింది. ఆగస్టులో ఏడు శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. తాజాగా 7.41 శాతానికి చేరింది. మరోవైపు, ఏడు కీలక రంగాల ప్రగతిని సూచించే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 0.8శాతం క్షీణించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీమ్​ ఇండియాకు షాక్.. వరల్డ్ కప్​కు మరో ప్లేయర్ దూరం
    టీమ్​​ ఇండియాకు మరో షాక్​ తగిలింది. గాయాలతో సతమతమవుతున్న జట్టు నుంచి మరో స్టార్​ ప్లేయర్​ దూరం కానున్నాడు. దీంతో టీ20 వరల్డ్​ కప్​లో టీమ్​ ఇండియా ప్రదర్శనపై నీలినీడలు కమ్ముకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒంటిపై దుస్తులన్నీ విప్పేసిన నటి.. ఇరాన్ మహిళలకు సంఘీభావం
    హిజాబ్​ ధారణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇరాన్​ మహిళ మాషా అమిని చనిపోయింది. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. ఆ నిరసనలకు వివిధ దేశాల నుంచి మద్దతు వస్తోంది. తాజాగా బాలీవుడ్​ భామ కూడా తన గలమెత్తి ఇరాన్​లో పోరాతున్న మహిళలకు మద్దతిచ్చింది. ఈ మేరకు సేక్రెడ్​ గేమ్స్ సిరీస్​లో ప్రధాన పాత్ర పోషించిన ఎల్నాజ్ నొరౌజీ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.