ETV Bharat / bharat

ప్రభుత్వ గ్యాస్​ సంస్థలకు కేంద్రం రూ.22వేల కోట్ల సాయం.. వారికి దీపావళి బోనస్

author img

By

Published : Oct 12, 2022, 5:13 PM IST

Updated : Oct 12, 2022, 7:53 PM IST

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మూడు గ్యాస్​ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. 2020 నుంచి 2022 మధ్యలో అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్లు విక్రయించి నష్టాలు మూటగట్టుకున్న ఈ సంస్థలకు రూ.22 వేల కోట్లు గ్రాంటు ప్రకటించింది.

fuel retail agencies
ప్రభుత్వ రంగ గ్యాస్​ సంస్థలకు కేంద్రం భారీ సాయం

ప్రభుత్వ రంగ గ్యాస్ రిటైల్ సంస్థలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్​పీజీ గ్యాస్​ను తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా నష్టపోయిన మూడు సంస్థలను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపింది. వన్-టైమ్ గ్రాంటు కింద రూ.22 వేల కోట్ల సాయం చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు ఈ గ్రాంటు అందుకోనున్నాయి.

'2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్య ఈ సంస్థలు అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్లను విక్రయించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వినియోగదారులకు సరఫరా చేశాయి. ఈ సమయంలో అంతర్జాతీయంగా ఎల్​పీజీ ధరలు 300 శాతం పెరిగాయి. కానీ, దేశీయంగా మాత్రం ఈ సమయంలో 72 శాతం మాత్రమే ఎల్​పీజీ ధరలు పెరిగాయి. వినియోగదారులపై భారం పడకుండా.. అధిక ధరలను వారికి బదిలీ చేయలేదు. నష్టాలు వచ్చినా.. మూడు సంస్థలు వినియోగదారులకు వంట గ్యాస్​ను నిరంతరం సరఫరా చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రూ.22వేల కోట్ల గ్రాంటు అందించాలని నిర్ణయించాం' అని ప్రభుత్వ ప్రకటన వివరించింది.

రైల్వే ఉద్యోగులకు కేంద్రం పండగ బోనస్​..రూ.1,832 కోట్లు
కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా.. 78 రోజుల బోనస్‌ ప్రకటించింది. 11.27లక్షల రైల్వే ఉద్యోగులకు రూ.1,832 కోట్ల బోనస్‌ ఇవ్వడానికి నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఒక్కో ఉద్యోగికి 78 రోజుల బోనస్‌ గరిష్ఠంగా రూ.17,951 అందనుంది. మరోవైపు ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం కొత్త పథకానికి, మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్‌ సొసైటీల సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
గుజరాత్​లోని ప్రభుత్వ-ప్రైవేట్​ ఆధీనంలో ఉన్న దీన్​దయాల్​ పోర్టులో కంటైనర్​ టెర్మినల్​ డెవలప్​మెంట్​ కోసం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 4,539 కోట్ల రూపాయలతో.. దీన్‌దయాల్‌ పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ అభివృద్ధి చేయనున్నారు.

ఇవీ చదవండి: 'ఆమె' పేరుతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులే కూలీలుగా మారి..

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కేంద్రం, ఆర్​బీఐలకు నోటీసులు

Last Updated :Oct 12, 2022, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.