ETV Bharat / state

Strange baby: శ్రీకాకుళంలో వింత శిశువు జననం.. పరిస్థితి విషమం

author img

By

Published : Oct 12, 2022, 5:54 PM IST

Strange baby in ap
ఆసుపత్రిలో వింత శిశువు జననం

Strange baby in ap: పాపో.. బాబో పుడుతుందని ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. పుట్టిన బిడ్డను చూసి తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. రెండు తలలు ఒకటే దేహంతో పుట్టిన ఆ పాపను చూసి.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Strange baby born: ఆ మహిళకు నెలలు నిండాయి.. పురుడు కోసం ఆసుపత్రికి వచ్చింది. పుట్టబోయే బిడ్డ కోసం ఆసుపత్రిలో ఆందోళనగా చూస్తున్నాడు ఆ పాప తండ్రి. అంతలోనే నర్సు వచ్చి పాప పుట్టిందని తెలిపింది. అయితే ఆ పాప మాత్రం అంటూ తడబడింది. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో వింత శిశువు జన్మించింది. మెళియాపుట్టి మండలం గేదల పోడూరు గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఉదయం 10:30 గంటలకు వింత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు కళ్ళు, రెండు ముక్కులు గల శిశువు జన్మించడంతో వైద్యులు అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. పరిస్థితిని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.