ETV Bharat / entertainment

ఒంటిపై దుస్తులన్నీ విప్పేసిన నటి.. ఇరాన్ మహిళలకు సంఘీభావం

author img

By

Published : Oct 12, 2022, 6:12 PM IST

హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాన్ మహిళలకు బాలీవుడ్​ హీరోయిన్ సంతాపం తెలిపింది. బుర్ఖా వేసుకుని.. ఆ తర్వాత దుస్తులను విప్పుతూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్​గా మారింది.

My body my choice
My body my choice

హిజాబ్​ ధారణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇరాన్​ మహిళ మాషా అమిని చనిపోయింది. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. ఆ నిరసనలకు వివిధ దేశాల నుంచి మద్దతు వస్తోంది. తాజాగా బాలీవుడ్​ భామ కూడా తన గలమెత్తి ఇరాన్​లో పోరాతున్న మహిళలకు మద్దతిచ్చింది. ఈ మేరకు సేక్రెడ్​ గేమ్స్ సిరీస్​లో ప్రధాన పాత్ర పోషించిన ఎల్నాజ్ నొరౌజీ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అనేక దుస్తులు ధరించిన ఆమె.. పైనుంచి నల్లటి బుర్ఖా వేసుకుంది. అనంతరం ఒకదాని తర్వాత ఒకటి దుస్తులని తీసేస్తూ 30 సెకన్ల వీడియో పోస్టు చేసింది. దీంతో పాటు "ఈ ప్రపంచలోని ప్రతి మహిళ.. ఎక్కడినుంచి వచ్చిందో అని సంబంధం లేకుండా తనకు నచ్చిన దుస్తులు.. తమకు నచ్చిన విధంగా.. నచ్చిన చోట ధరించొచ్చు" అని రాసుకొచ్చింది.

'ఏ పురుషుడికైనా, మహిళకైనా.. ఆడవాళ్లు ధరించే దుస్తులు గురించి జడ్జ్​ చేసే హక్కు గానీ.. ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలని చెప్పే అధికారం కానీ లేదు' అని నటి అభిప్రాయపడింది. " ప్రతి ఒక్కరికి వివిధ ఆలోచనలు, నమ్మకాలు ఉంటాయి" ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే అధికారం. ప్రతి మహిళకు తన గురించి నిర్ణయించుకునే అధికారం ఉంది. నేను నగ్నత్వాన్ని ప్రచారం చేయడం లేదు. నేను తమకు ఏది కావాలో అది ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రచారం చేస్తున్నాను" అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్​ సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.

గత నెలలో మాషా అమిని అనే ఇరాన్ మహిళ పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. తన కేశాలను కొద్దిగా చూపించినందుకు.. కఠినమైన దుస్తుల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు పోలీసులు ఆమెను చంపేశారని వార్తలు వచ్చాయి. దీంతో దేశం మొత్తం భగ్గుమంది. నిరసన జ్వాలలతో అట్టుడుకిపోయింది. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ.. 'మహిళలు స్వేచ్ఛను అనుభవించనివ్వండి', 'నా సోదరిని చంపిన వాళ్లను నేను చంపుతా' అనే నినాదాలతో ఉద్యమం చేస్తున్నారు.

కాగా, నటి ఎల్నాజ్ నొరోజీ.. ఇరాన్​లోని టెహ్రాన్​లో జన్మించింది. 2017లో వచ్చిన 'మాన్​ జావో నా' అనే చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. అనంతరం 'ఖిడో ఖుండి' అనే పంజాబీ చిత్రంలో నటించింది. 2018లో నెట్​ఫ్లిక్స్​లో వచ్చిన 'సేక్రెడ్​ గేమ్స్​' అనే సిరీస్​లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించింది. ఆ తర్వాత 2019 లో జీ5లో వచ్చిన వెబ్​ సిరీస్​ 'అభయ్'​లో కునాల్​ ఖేముతో కలిసి నటించింది.

ఇవీ చదవండి : మాస్కు తీయమంటే తీయవేం.. అందం తరిగిపోద్దనా!

కొడుకు​ చేసిన ఆ పనికి షో మధ్యలోనే ఏడ్చేసిన అమితాబ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.