ETV Bharat / entertainment

కొడుకు​ చేసిన ఆ పనికి షో మధ్యలోనే ఏడ్చేసిన అమితాబ్​

author img

By

Published : Oct 12, 2022, 1:41 PM IST

తన తనయుడు, నటుడు అభిషేక్​ బచ్చన్​ చేసిన ఓ పనికి దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ ఓ షో నిర్వహిస్తుండగానే మధ్యలో బాగా ఏడ్చేశారు. ఇంతకీ అభిషేక్​ ఏం చేశారంటే?

amitab emotional
అమితాబ్​ భావోద్వేగం

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మంగళవారం తన 80వ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బిగ్​బీ బర్త్‌డే సందర్భంగా ఆయన హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'కౌన్‌ బనేగ కరోడ్‌ పతి' షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్‌ను సర్‌ప్రైజ్‌ చేసేందుకు తల్లితో కలిసి ఆయన తనయుడు, హీరో అభిషేక్‌ బచ్చన్‌ షోకు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.

షో జరుగుతుండగా ఒక్కసారిగా సైరన్ మోగడం.. అదేంటి షో అయిపోయిందా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్‌ సడెన్‌ ఎంట్రీతో బిగ్​బీని సర్​ప్రైజ్​ చేశారు. తనయుడి రాకతో అమితాబ్​ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. అనంతరం తండ్రిని హాట్‌ సీట్‌లో కూర్చోబెట్టి, హోస్ట్‌ సీట్‌లో తాను కూర్చోని బిగ్​బీతో ముచ్చటించారు అభిషేక్​. ఈ సందర్భంగా బిగ్‌బీ.. అభిషేక్‌కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అయితే ఇందుకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను అభిషేక్‌ సోషల్​మీడియాలో షేర్‌ చేశారు. 'దీని వెనుక చాలా ప్రణాళిక, ఎన్నో రిహార్సల్‌, హార్డ్‌ వర్క్‌ ఉంది. చాలా సీక్రెట్​గా చేశాం. ఇది సరిగ్గా చేయడానికి ఎంతో కష్టపడ్డాం. నాన్న 80వ పుట్టిన రోజును ఆయన ఎంతో ఇష్టపడే వర్క్‌ ప్లేస్‌లో(కేబీసీ షో) జరపడం సంతోషంగా ఉంది. ఈ షోను చాలా ప్రత్యేకంగా చేసేందుకు నాకు సహాయం చేసిన సోనీ టీవీ, కౌన్‌ బనేగా కరోడ్‌పతి టీమ్​కు నా కృతజ్ఞతలు" అంటూ అభిషేక్‌ రాసుకొచ్చారు.

ఇదీ చూడండి: రామ్​చరణ్​ చెప్తేనే ఆ పని చేశా.. లేదంటే: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.