ETV Bharat / business

క్రెడిట్ కార్డుతో హౌస్​​ రెంట్​ కడుతున్నారా ? ట్యాక్స్ నోటీసులు వస్తాయి జాగ్రత్త!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 1:08 PM IST

Paying Home Rent Through Credit Card : దేశంలో క్రెడిట్‌ కార్డును వినియోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కొంత మంది ఇంటి అద్దెను చెల్లించేందుకు కూడా క్రెడిట్‌ కార్డును వినియోగిస్తున్నారు. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఇలా చేయడం వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు రావచ్చు..! 200 శాతం పెనాల్టీ పడే అవకాశం ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం.

Paying Home Rent Through Credit Card
Paying Home Rent Through Credit Card

Paying Home Rent Through Credit Card : బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్‌ పాయింట్లను అందించడంతో దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌లు, మొబైల్‌ రీఛార్జ్‌లు, ఇంటి అద్దెల నుంచి అన్ని రకాల పేమెంట్లను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులను చేస్తున్నారు. అయితే క్రెడిట్​ కార్డ్​ ద్వారా ఇంటి రెంట్​ చెల్లించే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా 200 శాతం వరకు పెనాల్టీ పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అసలు క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి రెంట్‌ను చెల్లిస్తే ఎందుకు పెనాల్టీ విధిస్తారు ? ఇలా చేయడం చట్ట విరుద్ధమా ? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రివార్డుల కోసం..
చాలా మంది తమ ఇంటి అద్దెను క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లించే క్రమంలో అడ్డదారులు తొక్కుతున్నారు. రివార్డ్ పాయింట్లు, అఫర్ల కోసం హోమ్‌ రెంట్ పేరుతో నకిలీ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. ఆ నగదును బంధవులు లేదా స్నేహితుల అకౌంట్లకి మళ్లించుకుంటున్నట్లు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు గుర్తించాయి. అలాగే కొందరు వారి క్రెడిట్ కార్డు స్పెండింగ్ లిమిట్స్ లక్ష్యాలను చేరుకునేందుకు ఇలా.. ఫేక్ రెంట్ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అనేక థర్డ్‌ పార్టీ సంస్థలు నామ మాత్రపు రుసుము ఒక శాతం మాత్రమే యూజర్ల నుంచి వసూలు చేస్తున్నాయి.

'క్రెడిట్‌ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'.. రెండింట్లో ఏది బెటర్?

చట్ట విరుద్ధం..
అంతే కాకుండా మరి కొంత మంది టాక్స్‌ మినహాయింపుల కోసం ఇలా చేస్తున్నారు. అయితే పన్ను మినహాయింపుల కోసం ఇలా ట్రాన్సాక్షన్లు చేసి ఐటీఆర్​ ఫిల్లింగ్ సమయంలో​ నకిలీ అద్దె రసీదులు సమర్పించటం చట్ట విరుద్ధమని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి చెల్లింపులను ఆదాయపు పన్ను అధికారులు పర్యవేక్షిస్తుంటారు. అప్పుడు పన్ను ఎగవేతదారులకు అధికారులు నోటీసులు కూడా పంపుతారు. ఇంటి అద్దె పేరుతో మీ బంధువులు, స్నేహితుల అకౌంట్‌లలోకి నగదును పంపినప్పుడు దానిని వారు ఇన్‌కమ్ టాక్స్‌ రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. అలాగే ఏడాదికి రెంట్‌ ద్వారా ఇన్‌కమ్‌ రూ.లక్ష దాటితే మీకు అద్దె చెల్లించిన వారి పాన్ వివరాలు కూడా తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ పాన్ కార్డ్‌ వివరాలను ఇవ్వకపోతే ఆదాయపు అధికారుల నుంచి నోటీసులు రావచ్చు. అలాగే నిర్దేశించిన పరిమితులకు మించి రెంట్‌ను వసూలు చేస్తున్నప్పుడు దానిలో నుంచి టాక్స్ డేడక్టేడ్ సోర్స్ (టీడీస్) తీసివేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే భారీగా పెనాల్టి పడుతుంది. అప్పుడు మీరు ట్యాక్స్ లయబిలిటీపై 200 శాతం మేర పెనాల్టి కట్టాల్సి రావచ్చు. అద్దె చెల్లించినా లేదా తీసుకున్నా ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఉండేలా మీ ట్రాన్సాక్షన్లు ఉండేలా చూసుకోవాలి. అందుకు సంబంధించిన నియమాలను అందరూ తెలుసుకోవడం మంచిది.

క్రెడిట్​ కార్డును అతిగా వాడుతున్నారా? అయితే​ జాగ్రత్త!

Credit Card Benefits : క్రెడిట్ కార్డు వాడితే ఇన్ని లాభాలా..!! అవేంటో మీకు తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.