ETV Bharat / business

నేషనల్​ పెన్షన్​ స్కీమ్​లో కొత్త రూల్ - ఈ విషయం మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 2:04 PM IST

NPS Withdrawal New Rule : మీరు NPS చందాదారులా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ఎన్‌పీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మార్చేందుకు.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కొన్ని నిబంధనలను సడలిస్తూ కొత్త విత్​డ్రా రూల్ తీసుకొచ్చింది. మరి, ఆ రూల్ ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..

National Pension Scheme
NPS

NPS Withdrawal Rules Changed : ప్రధానంగా.. వేత‌న జీవుల‌కు రిటైర్‌మెంట్‌ తర్వాత ఆర్థిక భ‌రోసాను అందించ‌డం కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన స్కీమ్.. జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(NPS). ఇది సాధార‌ణ పౌరుల‌కు కూడా అందుబాటులో ఉంది. సురక్షిత ఉద్యోగ విరమణ ఇన్వెస్ట్​మెంట్ స్కీమ్​లలో NPS ఒకటి. దీనికి కేంద్ర ప్రభుత్వ భరోసా ఉండడంతో ఎక్కువ మంది దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) తాజాగా కొన్ని నిబంధనలను సడలించింది. కొత్తగా ఖాతా ప్రారంభించాలనుకునే వారికి ఇది ఓ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏంటి? దాని వల్ల ఎన్​పీఎస్ పింఛన్​దారులు పొందే ప్రయోజనం ఏమిటి? అనే వివరాలను ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Some Changes in National Pension Scheme : నేషనల్ పెన్షన్ స్కీమ్(National Pension Scheme) సబ్ స్క్రైబర్స్ కోసం పీఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సిస్టమేటిక్ లంప్సమ్ విత్ డ్రాల్స్(SLW) అనే పేరుతో ఈ కొత్తరూల్​ వచ్చింది. నూతనంగా తీసుకొచ్చిన SLW సదుపాయం ద్వారా ఎన్​పీఎస్​ ఖాతాదారుడు తాను పెట్టిన పెట్టుబడి నుంచి తన అవసరాలకు అనుగుణంగా నగదును ఇన్ స్టాల్ మెంట్స్ మార్గంలో ఉపసంహరించుకోవచ్చు. అంటే.. ఎన్​పీఎస్ ఖాతాదారులు ఈ సిస్టమాటిక్ లప్సమ్ విత్ డ్రాల్ ఫెసిలిటీ ద్వారా వారి ఇష్టానుసారంగా నగదు విత్ డ్రాల్స్ చేసుకోవచ్చన్నమాట.

ఇప్పటి వరకూ ఎన్​పీఎస్​ రూల్ ఇలా.. ఎన్‌పీఎస్ పథకంలో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం పొందాల్సి ఉంటుంది. అంటే వారు పెన్షన్ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. తర్వాత ఒకేసారి మిగిలిన మొత్తాన్ని పొందవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్‌ను మెచ్యూరిటీ అమౌంట్‌లో కనీసం 40 శాతాన్ని పెట్టి దీనిని కొనాలి. అందులో ఇక మిగిలిన 60 శాతం మొత్తాన్ని ఖాతాదారులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారికి ఇప్పటివరకు రూల్స్ ఈ విధంగా వర్తిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

Best Pension Plan : రోజుకు 7 రూపాయల పెట్టుబడి.. నెలకు రూ.5వేల పెన్షన్.. ఈ స్కీమ్​ తెలుసా..?

కొత్త రూల్స్ ప్రకారం నగద్​ విత్​డ్రా ఇలా.. ఎన్​పీఎస్​లో వచ్చిన సిస్టమ్యాటిక్ లంప్ సమ్ విత్‌డ్రాయెల్ ఆప్షన్ ప్రకారం పింఛన్​దారులు మెచ్యూరిటీ మొత్తాన్ని ఒకేసరి కాకుండా విడతల వారీగా పొందవచ్చు. అంటే ఎన్​పీఎస్​ సభ్యులు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. SLW ప్రకారం మీరు ఎంచుకునే ఆప్షన్ ఆధారంగా డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే 75 ఏళ్లు వచ్చే వరకు మీరు డబ్బులు పొందొచ్చు. అలాగే దీని వల్ల రాబడి కూడా మీరు పొందవచ్చు. దీని ద్వారా మీరు స్థిరమైన నగదు ప్రవాహాలు, యాన్యుటీతో దాని కలయిక ద్వారా సంపదను నిర్మించగల సామర్థ్యం, అలాగే అన్ని నిధుల ఉపసంహరణలకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

NPS New Rule : ఎన్​పీఎస్​ ఖాతాదారులకు అలర్ట్​.. ఇకపై పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్​ తప్పనిసరి..

NPS Pension Scheme Get Returns 1 Lakh per Month : రిటైర్మెంట్ తర్వాత నెలకు లక్ష రూపాయల పెన్షన్.. ఈ పథకం తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.