ETV Bharat / business

ఫస్ట్​ టైం 'హోం లోన్' తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

author img

By

Published : Jul 20, 2023, 9:50 AM IST

Home Loans Details : సొంతిల్లు ఉండాల‌ని అంద‌రూ అనుకుంటారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ము అంతా దానికోస‌మే ఉప‌యోగిస్తారు. గ‌తంలో ఇల్లు క‌ట్టుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టేది. క‌ష్ట‌ప‌డిన సొమ్మంతా చేతికి వ‌చ్చిన త‌ర్వాతే నిర్మాణ ప‌నులు మొద‌లుపెట్టేవారు. కానీ నేడు లోన్‌, ఈఎంఐ వంటి స‌దుపాయాల‌తో త‌క్కువ స‌మ‌యంలోనే సొంతిల్లును నిర్మించుకుంటున్నారు. అయితే.. మొద‌టి సారి హోం లోన్ తీసుకునే వారు త‌ప్ప‌కుండా ఈ విష‌యాల గురించి తెలుసుకోవాలి.

First Time Home Loan What Should Be Kept In Mind
ఫస్ట్​ టైం హోం లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు త‌ప్ప‌క‌ తెలుసుకోండి..!

Home Loan First Time : సొంతిల్లు క‌లిగి ఉండ‌టం ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. కొందరి జీవితంలో ఇది నెర‌వేరితే.. ఇంకొంద‌రి జీవితాల్లో క‌లగానే మిగిలిపోతుంది. గ‌తంలో సొమ్మంతా చేతికొచ్చిన త‌ర్వాత ఇల్లు ప‌నులు ప్రారంభించేవారు. కానీ.. నేటి కాలంలో ఈ క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డం కొంత‌వ‌ర‌కు సుల‌భ‌మే. సంపాద‌న సామ‌ర్థ్యం, లోన్, ఈఎంఐ లాంటి సౌక‌ర్యాలతో త‌క్కువ స‌మ‌యంలోనే సొంతిల్లు ఉండాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే మొద‌టి సారి హోం లోన్ తీసుకునే ముందు ఈ విష‌యాలు తెలుసుకుంటే మంచిది.

Home Loans : లోన్​ ఇచ్చే ముందు రుణదాత‌లు క్రెడిట్ స్కోర్‌, రాబ‌డి, ప్రాప‌ర్టీ టైటిల్‌, జాబ్ ప్రొఫైల్‌, తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం వంటి అంశాల‌ను పరిగణనలోకి తీసుకొని రుణం మంజూరు చేస్తారు. ఈ అంశాల్లో ఏ ఒక్క‌టి త‌క్కువైనా రుణం ఇవ్వడానికి నిరాక‌రిస్తారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో రుణం, దీర్ఘ‌కాలం ఉండే హోం లోన్ చెల్లించేందుకు త‌గిన ఆర్థిక సంసిద్ధ‌త అవ‌స‌రం. ఇందుకోసమే ఈ విష‌యాలు గురించి తెలుసుకోవ‌డం వ‌ల్ల ముందుకాలంలో అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. అవేంటంటే..

క్రెడిట్ స్కోరు
Home Loan Credit Score : చాలా రుణసంస్థ‌లు క్రెడిట్ స్కోరు 750, అంత‌కంటే ఎక్కువ ఉంటే మంచి స్కోరుగా భావిస్తారు. ఇలాంటి స్కోరుంటే సుల‌భంగా రుణం ల‌భిస్తుంది. అంతేకాకుండా.. చాలా మంది రుణ దాత‌లు త‌క్కువ వ‌డ్డీకే లోన్ ఇవ్వ‌డానికి ముందుకువ‌స్తారు. కాబ‌ట్టి రుణాలు పొందాల‌నుకునే వారు త‌మ క్రెడిట్ స్కోరును క్ర‌మం త‌ప్ప‌కుండా సమీక్షించుకోవాలి. చాలా బ్యాంకులు, ఫైనాన్షియ‌ల్ సంస్థ‌లు.. రెగ్యుల‌ర్ అప్​డేట్స్​తో పాటు స్కోరు వివ‌రాలను సైతం అందిస్తున్నాయి.

డౌన్ పేమెంట్
Home Loan Down Payment : ఆర్బీఐ నిబంధనల ప్ర‌కారం.. సంస్థ‌లు హోం లోన్ మంజూరుకు రుణ మొత్తాన్ని బ‌ట్టి ప్రాప‌ర్టీ విలువ‌లో 75 నుంచి 90 శాతం వ‌ర‌కు ఫైనాన్స్ చేయ‌వ‌చ్చు. హోం లోన్ ద్వారా ఫైనాన్స్ చేసిన ప్రాప‌ర్టీ విలువ నిష్పత్తిని ఎల్​టీవీ (లోన్​ టు వ్యాల్యూ) నిష్పత్తి అంటారు. మిగిలిన మొత్తాన్ని రుణ గ్ర‌హీతే స్వ‌యంగా డౌన్ పేమెంట్ లేదా మార్జిన‌ల్ కంట్రిబ్యూష‌న్ రూపంలో ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు గృహ రుణం తీసుకుంటే LTV నిష్పత్తి 90 శాతం ఉంటుంది. అదే రూ.30 ల‌క్ష‌లు, రూ.75 ల‌క్ష‌లు, అంత‌కంటే ఎక్కువ విలువ ఉన్నప్పుడు ఈ నిష్పత్తి 80-75 శాతం. అధిక డౌన్ పేమెంట్ చేయ‌డం వ‌ల్ల ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశ‌ముంది.

ఈఎంఐ చెల్లించే స్థోమ‌త‌
Home Loan EMI : రుణ దాత‌లు సాధార‌ణంగా ఈఎంఐ విధానానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ప్ర‌తిపాదిత గృహ రుణం ఈఎంఐ అనేది.. వారి మొత్తం జీతంలో 50-60 శాతం లోప‌ల ఉంటుంది. ఈ లిమిట్ దాటిన వారికి లోన్ మంజూరు చేసే అవకాశాలు త‌క్కువే. అలాంటి వారు లోన్ అప్రూవల్​ కోసం లాంగ్ టెన్యూర్ ఆప్ష‌న్​ను ఎంచుకోవ‌చ్చు. దీని వ‌ల్ల వారికి ఈఎంఐలు కూడా త‌గ్గుతాయి.

అత్య‌వ‌స‌ర నిధి నిర్వ‌హించుకోవ‌డం
Home Loan Emergency Fund : ఒక ఎమ‌ర్జెన్సీ ఫండ్​ను మెయింటెన్ చెయ్యాలి. ఇది అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఇన్సూరెన్స్​ ప్రీమియాలు, ఈఎంఐలు, రెంట్ త‌దిత‌రాలు చెల్లించ‌డానికి ఉపయోగపడతాయి. క‌నీసం 6 నెల‌ల వ‌ర‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫండ్ ఉండ‌టం వ‌ల్ల మీకు ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందులు ఎదురైన‌ప్పుడు లోన్ చెల్లింపులకు దోహదపడుతుంది. అంతేకాకుండా మాక్స్ సేవ‌ర్‌, మాక్స్ గెయిన్ లాంటి ఓవ‌ర్ డ్రాఫ్ట్ ప‌థ‌కాలు ఎంచుకుంటే మంచి ఫ‌లితాలుంటాయి. ఈ ప‌థ‌కాల్లో ఒక ఓవ‌ర్ డ్రాఫ్ట్ అకౌంట్ ఉంటుంది. ఇది మ‌న లోన్ అకౌంట్​కు లింక్ అయి ఉంటుంది. మ‌న న‌గ‌దును ఇందులో జ‌మ చేయ‌డం వ‌ల్ల లోన్​కు అవ‌స‌ర‌మైన అమౌంట్ ఆటోమేటిక్​గా క‌ట్ అయి మిగులు ఉంటుంది. అవ‌స‌రాల‌కు అనుగుణంగా న‌గ‌దును ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు కూడా.

ఎక్కువ సంస్థ‌ల్ని సంప్ర‌దించాలి
Home Loans Institutions : సంస్థ‌ల్ని బ‌ట్టి వ‌డ్డీ రేట్లు, LTV నిష్పత్తి, చెల్లింపు కాలం త‌దిత‌రాలు మారుతూ ఉంటాయి. కాబ‌ట్టి మొద‌టి సారి రుణం తీసుకోవాల‌ని అనుకునే వారు ర‌క‌ర‌కాల కంపెనీల్ని సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకోవాలి. లోన్ అకౌంట్ల‌ను నిర్వ‌హించేవారిని, ఆన్​ లైన్ మార్కెట్ ప్లేసు వంటి ఈ-కామర్స్​ సైట్​లను సంప్ర‌దిస్తే కావాల్సిన స‌మాచారం తెలుస్తుంది. ఆ కంపెనీల్లో నుంచి మంచి ఇంట్రెస్ట్ రేట్లు, చెల్లింపు కాలం, లోన్ అమౌంట్‌, ప్రాసెసింగ్ ఫీజు లాంటి అంశాలను బేరీజు వేసుకొని లోన్​తీసుకునే విషయంలో సరైన ఆప్షన్​ను ఎంపిక చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.